Jagan_KCRనేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఈరోజుతో ఆయన 66వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి అభిమానులు సంబరాలలో మునిగిపోతున్న్నారు. ఇది ఇలా ఉండగా కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన తండ్రికి వినూతనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

“నాకు తెలిసిన ధైర్యశాలి.., విలక్షణ వ్యక్తిత్వం గల, దయామయుడైన.. చరిష్మా గల వ్యక్తి.. ఆయనను నాన్నా అని పిలవడానికి నేనెంతో గర్విస్తాను.. మీరు ఆయురారోగ్యాలతో చిరకాలం వర్థిల్లాలి. దూరదృష్టి, నిబద్ధత కలిగిన మీరు.. ఇలాగే కలకాలం మాకు ఆదర్శంగా నిలవాలి. తల్లిని కన్న తనయుడికి జన్మదిన శుభాకాంక్షలు” అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

తెలంగాణ రాష్ట్రాన్ని తల్లితో పోల్చి, కేసీఆర్ ని తనయుడు అని చెప్పి, అదే సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు అని తల్లిని కన్న తనయుడు అంటూ కీర్తించారు కేటీఆర్. కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ… పలువురు ప్రముఖులు నగరంలో భారీ కటౌట్లు ఏర్పాటు చేసి అభిమానం చాటుకుంటున్నారు.

ముందుగా చెప్పినట్టుగా నాయకులు చాలా మంది ఈరోజున ఒక మొక్కనైన నాటే పనిలో పడ్డారు. కేసీఆర్ ని కలవడానికి వచ్చిన నేతలు కూడా మొక్కలు తీసుకుని రావడం విశేషం. మరోవైపు.. దక్షిణాఫ్రికా, మలేషియా తదితర దేశాల్లో సైతం టీఆర్‌ఎస్‌ ఎన్నారై విభాగం నాయకులు కేసీఆర్‌ బర్త్‌డేను ఘనంగా నిర్వహిస్తున్నారు.