ys jagan wife-ys bharathi-named-ed-chargesheetవైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి పేరు కూడా భారతి సిమెంట్స్ పెట్టుబడుల కేసులో చేర్చింది ఈడీ. ఆ కేసులో ఆమెను ఐదవ ముద్దాయిగా చేర్చింది ఈడీ. దీనిపై ఇప్పటికే జగన్ ఘాటుగా స్పందించారు. ఈడీపై కాకుండా ఆ వార్తను ప్రచురించిన మీడియాపై ఆయన నిప్పులు చెరిగారు.

రాజకీయాల్లోకి ఇంట్లోని వారిని లాగడం ఏంటని ప్రశ్నించారు. అయితే ఎన్నికలకు కొద్దీ సమయం ఉండగా ఇది ఎందుకు జరిగిందా అని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. దీనికి రెండు అవకాశాలు ఉన్నాయి. వైకాపా బీజేపీ రహస్య స్నేహం నడుపుతున్నాయి అనే అభిప్రాయం విస్తృతంగా ఉంది. దీని ద్వారా అదేమీ కాదని ఒక మెసేజ్ పంపినట్టుగా ఉంది.

ఎన్నికల వేళ ఇటువంటి ప్రయత్నంతో జగన్ కు ప్రజలలో సింపతీ కూడా కలిగించినట్టు అవుతుంది. ఇంకో అభిప్రాయం ఏంటంటే బీజేపీ హై కమాండ్ ఈ పనితో జగన్ ఒక వార్నింగ్ ఇచ్చినట్టు కూడా ఉంది. తాము దేశంలోనే అత్యంత శక్తివంతులమని, తమతో జాగ్రత్తగా ఉండకపోతే జరిగే పరిణామాలేంటో చెప్పకనే చెప్పారు.

ఎలాగూ వచ్చే ఎన్నికలలో బీజేపీనే మళ్ళీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనితో జాగ్రత్తగా ఉంటే నీకే మంచిది అని సంకేతం ఇచ్చారు. దీని తాలూకు ఎఫెక్ట్ ఇప్పటికే జగన్ మీద కనిపించింది. కేంద్రం మీద కాకుండా మీడియాపై స్పందించినప్పుడే ఆయనకు తత్వం బోధపడిందని మనకు అర్ధం కావాలి.