YS Jagan warning to policeజగన్ మోహన్ రెడ్డి మరోసారి పోలీసులపై విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో వారిని బెదిరించారు. ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వమే ఉండదన్న సంగతి పోలీస్ అదికారులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. అధికారంలోకి వస్తే వాళ్ళ పని పడతా అని చెప్పకనే చెప్పారు. మీ టోపీ మీద ఉన్న మూడు సింహాల కోసం మీరు పని చేస్తున్నారనే సంగతి ప్రతి పోలీసు సోదరుడు మర్చిపోవొద్దు అని అన్నారు

మీరు విధుల్లో ఉన్నది ఆ సింహాల వెనుక ఉన్న గుంట నక్కలకు సెల్యూట్‌ చేయడానికి కాదు అని హెచ్చరించారు. వివరాల్లోకి వెళ్తే జగన్ పాదయాత్ర షెడ్యూల్ ముందే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఇది జగనే స్వయంగా పోలీసులకు పాదయత్ర ముందు పోలీసులకి ఇచ్చిన హామీ. నాకు z క్యాటగిరీ బద్రత ఉంది అని, పోలీసులు తగు ఏర్పాట్లు చెయ్యాలి అని ఆయన కోరారు

అయితే జగన్ మాత్రం, అనుమతి లేకుండా ఎక్కడ పడితే అక్కడ సభలు పెడుతున్నారు. దీనితో చివరి నిముషంలో భద్రత కలిపించడం కష్టం అవుతుంది. ఇదే విషయం నిన్న పోలీసులు లేవనెత్తారు. అనుమతి లేకుండా హుసేనాపురంలో సమావేశం నిర్వహించవద్దు అని చెప్పినా వినలేదు.

దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 188, 30 పోలీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అయితే దీనిని పోలీస్ ధికారంలా జగన్ భావించి వారికి వార్నింగ్ ఇచ్చారు. నిజానికి ఇలాంటి మాటలు జగన్ కు కొత్త కాదు. వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో, నువ్వు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుంటున్నావ్ అంటూ అక్కడ పోలీసుల మీద వీరంగం వెయ్యడం చూశాం.

అలాగే నిజాయితీగల ఐఏఎస్ ఆఫీసర్ గా పేరు ఉన్న, కృష్ణా జిల్లా మాజీ కలెక్టర్ అహ్మద్ బాబుని, నిన్ను జైలుకి తీసుకుపోతా అనడం చూశాం. ప్రభుత్వ డాక్టర్ ల దగ్గర బలవతంగా, చేతిలో రిపోర్ట్ లు లాక్కుంది చూశాం. ఇది వ్యవస్థలపై దాడుల కనిపిస్తుంది. ముఖ్యమంత్రి అవ్వాలని అనుకునే వ్యక్తికి ఇది మంచిది కాదు.