Wjaganhy-is-Jagan--Fearing-Electionsనరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తమ పార్టీ మీద తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన అనేక టీవీ డిబేట్లలో మాట్లాడుతూ చేసిన ప్రధాన ఆరోపణ తనకు గానీ పార్టీలోని చాలా మంది ప్రజా ప్రతినిధులకు గానీ ముఖ్యమంత్రి జగన్ అప్పోయింట్మెంట్ ఇవ్వడం లేదని.

మిగతా విషయాలు ఎలా ఉన్నా.. ఈ విషయంలో జగన్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు జగన్. ప్రతిరోజు కనీసం పది మంది ఎమ్మెల్యేలకు అప్పోయింట్మెంట్ ఇవ్వాలని ఆయన తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించినట్టు సమాచారం. ప్రధానంగా ఎమ్మెల్యేల, ఎంపీల అసంతృప్తి మరియు నియోజకవర్గ సమస్యలు పై మాట్లాడే అవకాశం ఉందని సమాచారం.

తమ కోటరీలోని కొందరికి తప్ప… నాయకులకు సైతం జగన్ అందుబాటులో ఉండరు అనే అపవాదు జగన్ పై ప్రతిపక్షంలో ఉన్న నాటి నుండీ ఉంది. అధికారంలోకి వచ్చాకా కూడా అవే ఆరోపణలు ఉన్నాయి. ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలు చేప్పట్టారు ముఖ్యమంత్రి.

ఇది ఇలా ఉండగా… కరోనా పరిస్థితులు చక్కబడితే… ఆగస్టు నాటికి జిల్లాల పర్యటనలకు వెళ్లి జగన్ ప్రజలను డైరెక్టుగా కలిసే అవకాశం ఉందని సమాచారం. వివిధ సంక్షేమ పథకాల అమలను పర్యవేక్షించి… వాటి మీద డైరెక్టుగా ప్రజల నుండే ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని జగన్ అభిప్రాయంగా ఉందని సమాచారం.