YS Jagan-USA -personal tour- leaving flood areas2009 తరువాత వచ్చిన అతిపెద్ద వరద వల్ల కృష్ణ గుంటూరు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి భారీగా నీటిని విడుదల చేస్తుండటంతో దిగువన ఉన్న నదీ పరీవాహక ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. వరద ప్రభావం కృష్ణా జిల్లాలోని 18 మండలాల్లోని 34 గ్రామాలపై ఉంది. గుంటూరు జిల్లాలోని 14 మండలాల్లోని 53 గ్రామాలపై వరద ప్రభావం కొనసాగుతోంది. బాధితులు దీనివల్ల అష్టకష్టాలు పడుతున్నారు. అయితే వారి కష్టాల కంటే రాజకీయాలు పెద్ద పీఠ వేసుకోవడం గమనార్హం.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహాయక చర్యలను పట్టించుకోకుండా అమెరికా వెళ్ళిపోయారని విమర్శలు వస్తున్నాయి. అందుబాటులో ఉన్న మంత్రులు కూడా చంద్రబాబు ఉండవల్లి ఇల్లు ఎప్పుడు వరదలో మునుగుతుందా ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి టీడీపీని ఎద్దేవా చేద్దామా అనే ఆసక్తితోనే ఉంటున్నారు. ఛానెల్స్ లో బ్రేకింగ్ న్యూస్ కోసం చంద్రబాబు కుటుంబం ఇంట్లో లేకపోయినా వరద వచ్చేస్తుంది ఖాళీ చెయ్యాలంటూ తాడేపల్లి తహసీల్దార్‌ చేత నోటీసులు ఇప్పించారు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన పాలన ఇప్పటికీ చంద్రబాబు ఇంటి చుట్టే తిరగడం గమనార్హం.

ఇక ప్రతిపక్ష పార్టీకి అధికారపార్టీ, సాక్షి వేస్తున్న బురదను కడుక్కోవడం తోనే సమయం సరిపోతుంది. ఈ రాజకీయం మధ్య వరద బాధితులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ప్రకాశం బ్యారేజీవద్ద ఉదయం 8.21 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇంకో వైపు ఇంతవరద వచ్చినా రాయలసీమకు నీటిని మళ్లించడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని విమర్శలు వస్తున్నాయి. ప్రాధామ్యాలు తప్పుగా ఎంచుకుంటే వచ్చే ఇబ్బందులే ఇవి.