YS Jagan Mohan Reddyప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలకు ఒక వారం పాటు బ్రేక్ ఇచ్చి హాలిడేకు వెళ్ళారు. ఈరోజు తెల్లవారు జామున ఆయన సతీమణి భారతితో పాటు లండన్ బయలుదేరి వెళ్ళారు. లండన్ లోని లండన్ స్కూల్ అఫ్ ఎకనామిక్స్ లో చదువుతున్న వారి కుమార్తె వర్ష రెడ్డిని కలవడంతో కోసం వెళ్లారు జగన్. తిరిగి ఈ నెల 26న హైదరాబాద్ కు తిరిగి వస్తున్నారు. గత నెలలో పాదయాత్ర అయిపోయిన వెంటనే ఈ టూర్ కు వెళ్లాల్సి ఉంది అయితే చివరి నిముషంలో వాయిదా వేసుకున్నారు.

జగన్ మోహన్ రెడ్డి లండన్ టూర్ రాష్ట్రంలో రాజకీయాలు పతాక స్థాయిలో ఉన్నప్పుడు జరుగుతుంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు ఆ స్కీం ఈ స్కీం అంటూ జనాలను గుక్కతిప్పుకోనివ్వకుండా తాయిలాలు కురిపిస్తున్నారు. మరోపక్క తాము ఏమీ తక్కువ తినలేదు అన్నట్టు జగన్ కూడా టీడీపీ నుండి అసంతృప్త ఎమ్మెల్యేలను ఎంపీలను పార్టీలోని తీసుకుంటూ అధికార పార్టీ విశ్వాసాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. జగన్ ఇక్కడ అందుబాటులో లేకపోవడంతో ఈ చేరికలు మందగించవచ్చు.

అదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ప్రభుత్వం కూడా కొత్త పథకాలు ఏమీ ప్రకటించే వీలు లేదు. మరోవైపు జగన్ తిరిగి వచ్చాక అమరావతిలోని తన కొత్త ఇంటి గృహప్రవేశం ఉంటుందని తెలుస్తుంది. అది ఇప్పటికే జరగాల్సి ఉండగా చివరి నిముషంలో వాయిదా పడింది. ఆ తరువాత ఎన్నికల వరకు అమరావతిలోని ఉంటూ ప్రజలకు భరోసా కలిపించాలని జగన్ వ్యూహంగా ఉంది. ఇప్పటివరకు జగన్ హైదరాబాద్ లోని తన లోటస్ పాండ్ ఇంటి నుండే పార్టీ కార్యకలాపాలు కూడా సాగిస్తున్నారు.