Zero Progress in Polavaram in YS Jagan's First Yearతెలుగు ఫిలిం ఇండస్ట్రీ పెద్దలు ఒక స్పెషల్ ఫ్లైట్ లో ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని కలిసొచ్చారు. తనకు తగినంత గౌరవం ఇవ్వడం లేదని జగన్ చాలా కాలం నుండి టాలీవుడ్ మీద గుర్రుగా ఉన్నారు. మొత్తానికి కరోనా వల్ల వారిని తనదగ్గరకు రప్పిచుకోగలిగారు జగన్.

అయితే వారు వచ్చినా వారికి బుద్ధి చెప్పాలి అనే ధోరణిలోనే జగన్ ఉన్నట్టు కనిపించిందని సమాచారం. తెలంగాణలో షూటింగులకు వెంటనే పర్మిషన్ ఇచ్చినా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం జులై 15 నుండే అని చెప్పారట. తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే జగన్ కూడా ఇచ్చేస్తారు అనుకున్న వారికి షాక్ కలిగిందంట.

సినిమా థియేటర్లకు ఫిక్సడ్ కరెంటు చార్జీలు తీసెయ్యడం, సినిమా టిక్కెట్లకు ఫ్లెక్సిబుల్ రేట్లు, నంది అవార్డ్స్ ఫంక్షన్లు, విశాఖలో స్టూడియోలకు స్థలాలు, ఇళ్ల స్థలాలు వంటి అనేక అర్జీలు పెట్టుకున్నారట వారు. అయితే దేనికి కూడా ముఖ్యమంత్రి నుండి స్పష్టమైన హామీ రాలేదని, చూద్దాం ఆలోచిద్దాం అన్న విధంగానే ఆయన స్పందన ఉందని సమాచారం.

కొన్ని ప్రతిపాదనలకు ప్రభుత్వం ఒకే చెప్పినా పలు మార్లు తిప్పించుకుని గానీ చేసే ఉద్దేశం ముఖ్యమంత్రికి లేదంట. అయితే ఇండస్ట్రీ పెద్దలు మాత్రం దీని వల్ల తమకు ఎటువంటి నష్టం లేదంటున్నారు. “ఏపీలో షూటింగ్ జరుపుకునే సినిమాలు తక్కువ. జులై 15 వరకు ఆగడం వల్ల నష్టమేమి లేదు. విశాఖలో ప్రభుత్వం స్థలాలు ఇస్తే ఈ సమయంలో పెట్టుబడులు పెట్టే ఉద్దేశం లేదు. హైదరాబాద్ లోనే మాకు కంఫర్ట్. ఏదో మర్యాదపూర్వకంగా వెళ్ళాం.. వెళ్ళాం కాబట్టి అడిగాం అంతే,” అని వారు అనడం గమనార్హం.

Confused & Not Sure What to Watch on Amazon Prime, Netflix? Click Here