YS Jagan to launch Idham Jagat teaserఎప్పుడు రాజకీయాలతో బిజీబిజీగా ఉండే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఓ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నారు. తన చిరకాల స్నేహితుడు, క్లాస్ మేట్ అయిన సుమంత్ హీరోగా నటించిన “ఇదంజగత్” అనే సినిమా టీజర్ సోషల్ మీడియా ద్వారా వైఎస్ జగన్ ఆవిష్కరించబోతున్నారు.

గతంలో ఓ మీడియా ప్రతినిధి చేసిన ఓ ఇంటర్వ్యూలో… తనకు – వైఎస్ జగన్ కు ఉన్న అనుబంధం గురించి సుమంత్ ప్రత్యేకంగా చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. బహుశా అదే సాన్నిహిత్యంతో ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయడానికి జగన్ ఒప్పుకున్నారో ఏమో గానీ, మంగళవారం నాడు ఈ టీజర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.