ys jagan tirumala visit todayనేటి నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. కనుక ఆనవాయితీ ప్రకారం ముఖ్యమంత్రి దంపతులు శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించాలి. అయితే ఈసారి కూడా సిఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.

వైఎస్ కుటుంబం క్రీస్టియన్ మతం అవలంభిస్తుంది కనుక వారు హిందూ మతాచారాలను పాటించకపోవచ్చు. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇతర మతాలను పాటించకపోయినా గౌరవించాల్సి బాధ్యత ఉంటుంది. అదీగాక తన మతానికే అని గిరిగీసుకొని కూర్చోంటే రాజకీయాలలో రాణించలేరు. అందుకే సిఎం జగన్మోహన్ రెడ్డికి హిందూమతాచారాలను పాటించకపోయిన ఇటువంటి కార్యక్రమాలలో తప్పనిసరిగా పాల్గొంటారు. ఇక్కడ నమ్మకం కంటే పరమతాలను గౌరవించడమే ప్రధానం.

ముఖ్యమంత్రి హోదాలో భర్తతో పాటు భార్య కూడా పాల్గొనడం ధర్మం, ఆనవాయితీ. అయితే సిఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి ఈ మూడేళ్ళలో ఒక్కసారి కూడా భర్తతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. కనుక ఈసారి కూడా సిఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కరే తిరుమలకు వచ్చి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

ఇక మరో విషయం ఏమిటంటే, దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు తిరుపతి పట్టణంలో అడుగుపెట్టగానే వారిలో ఆధ్యాత్మిక భావనలు కలిగేందుకు తిరుమల కొండవైపు వెళ్ళే అన్ని ప్రధాన మార్గాలలో రోడ్లకి ఇరువైపులా ఉన్న గోడల మీద హిందూ దేవతలు, పురాణ గాధలకు సంబందించి అందమైన చిత్రాలను టీటీడీ గీయించింది.

నేడు సిఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతూ తిరుపతి పట్టణమంతా వైసీపీ ఫ్లెక్సీ బ్యానర్లు, పార్టీ జెండాలు, తోరణాలు కట్టారు. దానిని ఎవరూ తప్పుపట్టరు. కానీ గోడలపై గీయించిన ఆ హిందూ దేవతల బొమ్మలన్నిటిపై వైసీపీ జెండా రంగులు వేయించి, నవరత్నాలు, సంక్షేమ పధకాల ప్రకటనలు వ్రాయించారు.

వారి అధినేత హిందువు కానప్పటికీ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించడానికి వస్తుంటే, వైసీపీ నేతలు హిందూ దేవతల చిత్రాలపై పార్టీ రంగులు వేయించి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుండటం చాలా బాధాకరం. ఇదే… వేరే మతానికి చెందిన దేవతా మూర్తుల బొమ్మలపై ఈవిదంగా పార్టీ రంగులు వేసే ధైర్యం వైసీపీ నేతలకు ఉందా?