YS Jagan targeting Kamma Casteప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళ్ళి ఆ పార్టీ నాయకులతో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు చేరుస్తున్నారని, మరోవైపు వైకాపా సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని సీఈసీ సునీల్‌ అరోరా కంప్లయింట్ చేశారు. రాష్ట్రంలో పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తుందని, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను కీలక పోస్టుల్లో చంద్రబాబు ప్రమోట్‌ చేస్తున్నారని ఆరోపించారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన 35 మందిని సీఐలు, డీఎస్పీలుగా ప్రమోట్‌ చేశారన్నారు.

డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ను కూడా అదే కోవలో తీసుకొచ్చారని తెలిపారు. డబ్బు పంపిణీ కోసం పోలీసులను ఎలా వాడుకోబోతున్నారో వంటి విషయాలను ఈసీకి వివరించినట్లు జగన్‌ చెప్పారు. తనపై హత్యాయత్నం జరిగితే తప్పుదోవ పట్టించారని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. వీరందరినీ ఎన్నికల విధులకు దూరం పెట్టకపోతే ఎన్నికలు సజావుగా జరగనివ్వరని జగన్ తెలిపారు. అయితే ఉన్నఫళంగా కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చెయ్యడం పలువురికి ఆశ్చర్యం కలిగించింది.

పోలీసుల్లో అన్ని సామాజికవర్గాల వారూ ఉంటారు కాకపోతే ఒక్క కమ్మ సామాజిక వర్గాన్నే టార్గెట్ చెయ్యడం విశేషం. సహజంగా ప్రమోషన్లు అనేవి సీనియార్టీని బట్టి.. పనితీరును బట్టి వస్తాయి అంతేగానీ ఇష్టానుసారంగా ఇవ్వడానికి వీలు లేరు. ఒకవేళ అలా జరిగితే నష్టపోయిన వారు కంప్లయింట్ చేసే అవకాశం ఉంది. కోర్టుకు కూడా వెళ్లొచ్చు. గతంలో అటువంటివి జరిగాయి కూడా. అయితే చంద్రబాబు హయాంలో అటువంటివి మాత్రం తెర మీదకు రాలేదు. అయినప్పటికీ.. ప్రమోషన్లకు సామాజికవర్గానికి లింక్ పెట్టి వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా కలకలం రేపే అవకాశం కనిపిస్తోంది.

అయితే కచ్చితంగా కనిపిస్తున్న ఓటమికి జగన్ ఇప్పటినుండే వంకలు వెతుకుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సంఘానికి జగన్ దొంగ ఓట్ల లిస్టు అంటూ ఒక పెన్ డ్రైవ్ ఇచ్చారు. దొంగ ఓట్లు అంటూ తెలుగుదేశం మద్దతుదారుల లిస్టు ఇచ్చారేమో అని ఆ పార్టీ నాయకుల అనుమానం. కేంద్రంలోని బీజేపీ సపోర్టుతో టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తీయించేస్తారా అని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ పెన్ డ్రైవ్ లో ఇచ్చిన లిస్టు కేంద్ర ఎన్నికల సంఘం బయటపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.