YS Jagan - Swearingనవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్ అతిధులుగా విచ్చేశారు. జగన్ మోహన్ రెడ్డి స్వయంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కార్యక్రమానికి ఆహ్వానించినా పార్టీ కార్యక్రమం గనుక రాలేదు. ముగ్గురు టీడీపీ నేతలను పంపి జగన్ ను అభినందించి చంద్రబాబు పంపిన అభినందన లేఖను అందజేయ్యడానికి ప్రయత్నం చేశారు.

అయితే జగన్ వారికి అప్పాయింట్మెంట్ ఇవ్వలేదు. చివరి వరకూ ప్రయత్నించి వారు వెనుదిరిగారు. చంద్రబాబు జగన్ కు రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు. ప్రమాణస్వీకారం సందర్భంగా వ్యాఖ్యాతలు, చివరికి ముస్లిం మత పెద్దలు కూడా చంద్రబాబును విమర్శించడం గమనార్హం. ప్రమాణస్వీకారం అనంతరం తన ప్రసంగంలో కూడా జగన్ తెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దీనితో ఈ కార్యక్రమానికి వెళ్లకపోవడమే మంచిది అయ్యిందని టీడీపీ వారు అంటున్నారు.

మరోవైపు జగన్ ప్రమాణస్వీకారం అనంతరం చేసిన తన మొదటి ప్రసంగం తరువాత తన తల్లి విజయలక్ష్మిని కౌగిలించుకున్నారు. భావోద్వేగంతో ఆమె కంటతడిపెట్టేశారు. అనంతరం ఆమె కన్నీరు తుడిచిన జగన్ స్టేజ్‌పై నుంచి కిందికి తీసుకెళ్లారు. సభికులు, కార్యకర్తలు, అభిమానులు, అతిథులకు అభివాదం చేస్తూ జగన్.. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి నేరుగా తాడేపల్లిలోని తన స్వగృహానికి చేరుకున్నారు. కాసేపట్లో సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం కోసం ఢిల్లీ వెళ్లనున్నారు.