YS Jagan SSC examinationsరాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ నిర్ణయంతో లక్షలాది విద్యార్థులనే కాదు వారి కుటుంబాలను కరోనా ముప్పులోకి నెట్టేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

ఇక్కడ విశేషం ఏమిటంటే దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ విషయంగా ఇంత పట్టుదల గా లేదు. సీబీఎస్ఈ కూడా ఇప్పటికే పదవ తరగతి పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను ప్రమోట్ చేసింది. ఫస్ట్ వేవ్ లో కరోనా పిల్లల మీద కరోనా పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. అయితే ఈ సారి మాత్రం పదేళ్ల కు పైనా ఉన్న పిల్లలలో కేసులు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

క్లాస్ రూమ్లలో అంతా గుంపుగా కూర్చుని ఉండటం వల్ల పిల్లలలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వారు ఆ వైరస్ ని ఇంటికి తీసుకుని వెళ్లి.. ఇంట్లోని పెద్ద వారిని మరింత రిస్క్ లో పెడుతున్నారు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో రిస్క్ తో కూడుకున్నది అని అనుకోవాలి.

జగన్ ప్రభుత్వానికి ఆ కనీస బాధ్యత కూడా గుర్తు చెయ్యాలా? అనే విమర్శలు వస్తున్నాయి. కరోనా కారణంగా ఈ ఏడాది చదువులు అంతంతమాత్రమే. ఆన్ లైన్ క్లాసులలో ఏం చెప్పారో ఉపాధ్యాయులకు తెలీదు.. ఏం నేర్చుకున్నారో పిల్లలకు అంతకంటే తెలీదు. ఇటువంటి తరుణంలో పరీక్షలు పెట్టినా ఉత్తీర్ణతా శాతం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. తమ తప్పు లేకుండా అటు ఆరోగ్యరీత్యా ఇటు కెరీర్ దృష్ట్యా కూడా పిల్లలు ఇబ్బంది పడాల్సి రావొచ్చు.