ఇదేం దిక్కుమాలిన పోలిక జగన్!వన్ డే అసెంబ్లీ సమావేశాలలో భాగంగా గురువారం నాడు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సుదీర్ఘమైన ప్రసంగాన్ని చదివి వినిపించారు. ఏదో ఎమర్జెన్సీ తరహాలో ఒక్క రోజు అసెంబ్లీ సమావేశాలేంటి? ఈ ఒక్క రోజులో ఏం చర్చలు జరుపుతారు? అంటే…

ప్రజా సమస్యలపై చర్చలు జరపడానికి కాదు, కేవలం తాము చెప్పాలనుకున్నది చదివి వినిపించడానికి మాత్రమే… అందుకు అసెంబ్లీ ఓ సాక్ష్యంగా నిలుస్తుందన్న చందంగా నేడు ‘వన్ డే అసెంబ్లీ’ జరిగిందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

సాధారణంగా ఇలాంటివి ప్రెస్ మీట్స్ ద్వారా వెల్లడిస్తారు, కానీ ఏపీ సీఎం అంత సాధారణంగా మీడియా ముందుకు రారు కాబట్టి, ఈ అసెంబ్లీ సమావేశాలను ఓ ప్రెస్ మీట్ మాదిరి వినియోగించుకున్నారనేది లేటెస్ట్ పొలిటికల్ టాక్. ప్రతిపక్షం సభలో లేకుండా వైసీపీ తన డప్పును తానే కొట్టుకున్నట్లయ్యింది.

ఇదిలా ఉంటే మహిళా సాధికారిత అంశం జగన్ ప్రస్తావించిన అంశాలు మరింత హాస్యాస్పదంగా ఉన్నాయని, టీఎస్ సీఎం కేసీఆర్ భాషలో చెప్పాలంటే ‘ఇదేం దిక్కుమాలిన పోలిక’ అంటూ సోషల్ మీడియాలో జగన్ ప్రసంగంపై చేస్తున్న కామెంట్స్.

మహిళా సాధికారికతలో భాగంగా ‘దిశా’ అప్ ను 90 లక్షల మంది ఇప్పటికే డౌన్ లోడ్ లు చేసుకున్నారని చెప్పిన జగన్, గత ప్రభుత్వానికి – ఈ ప్రభుత్వానికి మహిళల పట్ల ఎలాంటి రక్షణ చర్యలు తీసుకున్నామో చెప్తానంటూ లెక్కలను బయటకు తీశారు.

గత ప్రభుత్వంలో మహిళలపై సెక్సువల్ నేరాల మీద 60 రోజుల్లో దర్యాప్తు చేసినవి కేవలం 14.5 శాతమని, అదే మన ప్రభుత్వంలో ఏకంగా 93.6 శాతంగా తెలియజేస్తున్నానని, ఈ విషయంలో ఇండియాలోనే ఏపీ నెంబర్ 1 అంటూ సగర్వంగా ప్రకటించుకున్నారు.

అలాగే మహిళలపై రేప్ అండ్ మర్డర్ కేసులలో గత ప్రభుత్వంలో 318 రోజులు పట్టగా, అదే మన ప్రభుత్వంలో ఇది 42 రోజులకు తగ్గించామని, గ్యాంగ్ రేప్ మీద విచారణకు గత ప్రభుత్వంలో సగటున 257 రోజులు పడితే, మన ప్రభుత్వంలో 42 రోజులకు తగ్గిందని ఈ సందర్భంగా తెలియజేసారు సీఎం.

ఈ లెక్కల చిట్టా కాకుండా, మహిళలపై జరుగుతున్న నేరాలను తగ్గించామని చెప్తే అది నిజంగానే సగర్వంగా ఉండేది గానీ, ఓ పక్కన నేరాలను నియంత్రించకుండా విచారణను వేగవంతం చేస్తే ప్రయోజనమేంటి? ఈ లెక్కలు తీసినట్టే…

గత ప్రభుత్వంలో మహిళలపై జరిగిన దాడులు, గత రెండేళ్లుగా జరిగిన అకృత్యాల లెక్కలను కూడా సీఎం వివరిస్తే బాగుండేది కదా! అన్నది సగటు ప్రజానీకం ఆలోచన. ప్రభుత్వం డిఫెన్స్ లో పడే లెక్కలు బయటకు చెప్పరు అన్నది పొలిటికల్ వర్గాల వివరణ.