ys jagan speech at salutation program narasaraopetజనసేన అధినేత పవన్ వైసీపీ నాయకులను., ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రతిసారీ ఎవరి దగ్గరనుంచో స్క్రిప్ట్ వచ్చింది.., చదివాడు..,వెళ్ళాడు..,అంటూ హేళన చేసే వైసీపీ నేతలకు ఇప్పుడు జగన్ చేసిన కార్యక్రమం ఏంటో కనపడడం లేదా? అంటూ జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు.

నర్సరావుపేటలో నిర్వహించిన వాలంటీర్ ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ తన ప్రసంగం ఆధ్యాంతం “చిన్న పిల్లవాడు పుస్తకాలు చదివిన” మాదిరిగా…, జగన్ తాను మాట్లాడే ప్రతి పదాన్ని చూసి పలుకుతున్నారని…., “స్క్రిప్ట్” అంటే అదే జగన్ గారు అంటూ సోషల్ మీడియాలో పవన్ అభిమానులు ట్రోల్స్ మొదలుపెట్టారు.

మీరు రాష్ట్రంలో యుద్ధం చేస్తుంది “మారీచులతో” కాదని., “స్క్రిప్ట్” లతో అంటూ జగన్ మీద సెటైర్లు పేలుస్తున్నారు. స్క్రిప్ట్ సరిగా చదవలేకపొతే., అటు ప్రతిపక్షాలు..,ఇటు మీడియా..,అలాగే ఏక్షన్-కట్ అన్నంత స్పీడ్ గా సోషల్ మీడియా నుండి వచ్చే రియాక్షన్స్ తో యుద్ధం చేయాల్సి వస్తుంది అనే భయంతో జగన్ తన ప్రసంగాన్ని పూర్తిగా చదువుకుంటూ ముగించారని విపక్ష పార్టీలు ఎద్దేవా చేస్తున్నాయి.

సమర్ధవంతుడైనా నాయకుడు, సమర్ధవంతంగా పాలన చేస్తున్నప్పుడు మాటలు వాటంతట అవే వస్తాయి.ఎవరో రాసిచ్చిన పేపర్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు., అలాగే రాసిచ్చిన పేపర్ చూసి చదవాల్సిన అవసరం ఉండదు. యుద్దాలు.,గుండెపోటులు.,గొడ్డలిపోటులు., కత్తి గాట్లు గురించి మాట్లాడేటప్పుడు స్క్రిప్ట్ వైపు చూడని కళ్ళు ..,ప్రభుత్వ కార్యక్రమాల గురించి చెప్పేటప్పుడు చూస్తున్నాయి అంటే ఏంటి దానర్ధం? అంటూ నిలదీస్తున్నారు నెటిజన్లు.

“అనుభవానికి – అహంకారానికి” మధ్య ఉన్న వ్యత్యాసం అంటే ఇదేనేమో అంటూ టిడిపి నాయకులు తమ అధినేత చంద్రబాబు ప్రసంగాలను గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు నాటి తరానికి ‘ఆదర్శంగా’ నేటి తరానికి ‘పోటీదారునిగా’ ఎప్పుటికీ నిలిచేవుంటారని, ఎటువంటి సందర్భంలో అయినా తడబడక తానూ చెప్పాలనుకున్నది ప్రజలకు అర్ధమయ్యే రీతిలో ‘స్క్రిప్ట్ పేపర్ల’ అవసరం లేకుండా చెప్పగల సత్తా బాబు సొంతం అంటున్నారు.

చేసింది చెప్పలేక., చెప్పింది చేయలేక., చివరకు చేసేదేం లేక ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ లు చదవలేక ముఖ్యమంత్రి ‘జగన్’ నిత్యం ప్రజల కోసం ‘స్క్రిప్ట్’ లతో యుద్ధం చేస్తూనే ఉన్నారు, మరికొంత కాలం చేస్తూనే ఉంటారు కూడా అంటున్నారు నెటిజన్స్.