YS Jagan Andhra Pradesh Three Capitalsకేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాం అని అధికారంలోకి వచ్చిన జగన్ దాదాపుగా ఆ అంశం మర్చిపోయారు అని అనుకుంటున్న తరుణంలో ఆ అంశాన్ని లేవనెత్తారు ఆయన. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన 6వ నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఈ అంశాన్ని ప్రస్తావించారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తేనే పారిశ్రామికాభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తామని స్పష్టం చేశారు. విభజన కారణంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్న సీఎం..విభజనకు ముందు ప్రత్యేక హోదా ఇస్తామని బేషరతుగా పార్లమెంట్‌లో ప్రకటించినట్టు గుర్తు చేశారు. అయితే ముఖ్యమంత్రి వైఖరిపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

“మునిసిపల్ ఎన్నికలు వస్తున్నాయి. వాటిలో సంక్షేమ కార్యక్రమాల ప్రభావం తక్కువ. చదువుకున్న వారు ఎక్కువ ఉంటారు కాబట్టి ప్రత్యేక హోదా అంటూ కొత్త నాటకానికి తెరలేపారు. ఏదో అడిగేసాం హాజరు వేయించుకున్నాం అని చెప్పుకునే ప్రయత్నం లానే ఉంది ఇది. ప్రత్యేక హోదా అనేది సాధించే పద్ధతి ఇదైతే కాదు అని వారు అంటున్నారు,” అని వారు ఎద్దేవా చేస్తున్నారు.

“పార్లమెంట్ లో మరీ ముఖ్యంగా రాజ్యసభలో బీజేపీకి మద్దతు కావాల్సినప్పుడల్లా వైఎస్సార్ కాంగ్రెస్ భేషరతుగా మద్దతు ఇచ్చింది. అప్పుడు బీజేపీ తనంతట తాను వైఎస్సార్ కాంగ్రెస్ సాయం కోసం వచ్చినా మోడీ అమిత్ షాలను ఇబ్బంది పెట్టకూడదని షరతులు పెట్టడానికి సిద్ధపడలేదు. ఏదో అడిగేసాం అంటే ఇచ్చేస్తారా?,” అని వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు.