YS- Jagan - Singapore -Consortium- Amaravati-ఆంధ్రప్రదేశ్ నుండి పెట్టుబడిదారుల నిష్క్రమణ కొనసాగుతుంది. అదానీ, అంబానీ తమ ప్రాజెక్టులను ఇప్పటికే తప్పించగా, తాజాగా సింగపూర్ కూడా అమరావతి లో స్టార్టప్ ప్రాజెక్టు పేరుతో మొదలు పెట్టదల్చిన ప్రాజెక్టు నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. పరస్పర అవగాహన తో ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగుతున్నట్లు సింగపూర్ ప్రకటించింది.

సింగపూర్ ప్రభుత్వానికి ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోర్టుకు లాగే అవకాశం ఉన్నా భారతదేశం తో సత్సంబంధాలు కొనసాగించే ఉద్దేశంతో ఆ పనికి పూనుకోలేదు. తమకు ఈ ప్రాజెక్టులో ఇప్పటికే కొన్ని మిలియన్ డాలర్ల నష్టం వచ్చిందని ఆ దేశం చెప్పుకొచ్చింది. కొత్త ప్రభుత్వం ప్రాధాన్యాలు మారిపోవడం వల్లే ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంటున్నాం అని తెలిపింది.

గతంలో 6.84 కిలో చదరపు కిలో మీటర్లు రాజధాని అమరావతి స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం ద్వారా సింగపూర్ కన్సార్టియం 2017లో ఏర్పడింది. మొత్తం 1691 ఎకరాల్లో మూడు దశల్లో స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేసేలా గత ప్రభుత్వం సింగపూర్ సర్కార్‌తో ఒప్పందం చేసుకున్న విషయం విదితమే.

ఆంధ్రప్రదేశ్‌, ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న అవకాశాలపట్ల సింగపూర్ కంపెనీలు ఇకపై కూడా ఆసక్తి కనబరుస్తాయి. ఇండియా ఓ అద్బుతమైన అవకాశాలు కలిగిన అతిపెద్ద మార్కెట్‌గా నేటికి మేం భావిస్తున్నాం’ అని ప్రకటనలో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ స్పష్టం చేశారు. అయితే సింగపూర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నుండి వైదొలగడం తో అంతర్జాతీయ పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.