YS Jagan silent on kapu reservationకాపులు ఎక్కువగా ఉండే తూర్పు గోదావరిలో జగన్ పాదయాత్ర సాగుతుంది. అయితే బీసీల ఓట్లు పోయేప్రమాదం ఉందని కాపు రేజర్వేషన్ల అంశంపై జగన్ పెదవి విప్పడం లేదు. కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో, అక్కడి వైసీపీ నేతలు, ఇప్పటికైనా కాపు రిజర్వేషన్ పై తేల్చి చెప్పమని ఆయన మీద ఒత్తిడి తెస్తున్నారు.

అధికారంలోకి వస్తే కాపులను బీసీ జాబితాలో చేరుస్తామని ప్రకటించిన చంద్రబాబు ఆ మేరకు అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపారు. అయితే ఆ విషయాన్నీ కేంద్రం తొక్కిపెట్టింది. కాపు రేజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు కూడా ప్రతిపక్షం అసెంబ్లీకి రాలేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ తొందర్లోనే జిల్లాకు రాబోతున్నారు.

ఈ దశలో వైసీపీ అధినేత జగన్‌తో కూడా కాపులకు సంబంధించి హామీ ఇప్పించకపోతే ఆ సామాజిక వర్గంలో పార్టీ వెనుకబడుతుందన్న ఉద్దేశంతో ఉన్న వైసీపీ కాపు నేతలు పట్టుదలతో ఉన్నారు. అయితే ఇప్పటికైనా జగన్ మౌనం వీడతారో లేదో చూడాలి. పశ్చిమ గోదావరిలో ఎంటర్ అయ్యి, దాదాపు ఇప్పటికి నెల రోజుల పైనే అయ్యింది. కనీసం తూర్పు గోదావరి జిల్లా దాటేలోగా అయినా ఆయన మాట్లాడతారేమో చూడాలి.