YS Jagan - YS Sharmilaప్రతిపక్షంలో ఉండగా సాక్షి… ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియా టీమ్ వైఎస్సార్ కాంగ్రెస్ కు చేసిన మేలు అంతా ఇంతా కాదు. వైఎస్సార్ కాంగ్రెస్ చేసిన ప్రతిపనిని పెద్దదిగా చేసి చూపిస్తూ… ప్రభుత్వాన్ని అభాసుపాలు చేస్తూ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లి జగన్ ని అధికారంలో కూర్చోబెట్టాయి. అయితే ఆ సౌలభ్యం ఇప్పటికైతే షర్మిలకు రాలేదు.

మొన్న ఆ మధ్య స్టూడెంట్స్ తో ఆత్మీయ సమ్మేళనం అంటూ పెట్టారు… అక్కడ ఒకతను తనకు తండ్రి లేడని..అన్నీ షర్మిల అక్కేనని కన్నీళ్లు పెట్టుకున్నాడు. షర్మిల కూడా అందుకు తగ్గట్టుగానే రక్తి కట్టించారు. అయితే ఆ తరువాత సదరు వ్యక్తి విద్యార్థి కాదని కల్వరి చర్చిలో డ్రమ్స్ వాయించే వ్యక్తి అని సోషల్ మీడియాలో దొరికిపోయారు.

మరోవైపు… ఖమ్మంలో ఏప్రిల్ 9న లక్షల మందితో సభ పెట్టి పార్టీని ప్రకటిస్తామని అలాగే జూలై 8న ఐదు లక్షల మందితో ఎల్బీ స్టేడియం సభ పెట్టి విధివిధానాలు ప్రకటిస్తామని ఆ పార్టీ వారు అంటున్నారు. ఎల్బీ స్టేడియంలో కనీసం యాభై వేల మంది కూడా పట్టే అవకాశం లేదు. సహజంగా వైఎస్సార్ కాంగ్రెస్ సమయంలో ఇటువంటి వాటి మీద చాలా జాగ్రత్త పడేవారు.

ఒకవేళ ఎక్కడన్నా తేడా కొట్టినా సాక్షిలో మరుసటి రోజు గ్రాఫిక్స్ చేసేవారు. ఈ మధ్య సాక్షిలో షర్మిల పార్టీకి బానే కవరేజ్ ఇస్తున్నా ఏకంగా గ్రాఫిక్స్ స్థాయి సౌలభ్యం ఉంటుందో తెలియదు. పాపం షర్మిల… ఆ విషయంలో జగన్ సపోర్ట్ ని మిస్ కావడం ఖాయం అని సోషల్ మీడియా ఎద్దేవా చేస్తున్నారు.