YS Jagan sattire on chandrababu naiduబిజెపి అద్యక్షుడు అమిత్ సా పై చంద్రబాబు రాళ్లు వేయించారని, ఆ తర్వాత తూచ్ అని అన్నారని జగన్ ఎద్దేవ చేశారు. కర్నాటకలో ఎన్నికల ప్రచారం కోసం అమిత్ షా పై రాళ్లు వేయించారని, ఆ తర్వాత ధైర్యంగా తానే రాళ్లు వేయించానని చెప్పలేకపోయారని, తూచ్ అన్నారని జగన్ ఎద్దేవ చేశారు.

చంద్రబాబు మాటలన్నీ ఉత్తర కుమారుడు మాదిరిగా ఉన్నాయని అన్నారు. చంద్రబాబు భయపడుతున్నారని, ఆయన విపరీతంగా చేసిన అవినీతి పై ఎక్కడ కేసులు వస్తాయోనని ఆయన ఆందోళన చెందుతున్నారని జగన్ విమర్శించారు. చంద్రబాబు కేసుల గురించి భయపడితే అమిత్ షా మీద రాళ్లు ఎందుకు వేయిస్తారు?

ఒకసారి వేయించి కాదని చెప్తే అమిత్ షా నమ్ముతారని చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడు ఎలా అనుకుంటారు? అసలు చంద్రబాబు వేయించకపోయినా నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు. అమిత్ షా మీద తిరుమలలో రాళ్ళు వేయిస్తే కర్ణాటకలో ప్రచారం ఎలా అవుతుందో? కేసులంటే భయపడని జగన్ మోడీ – అమిత్ షాను ఏ రకంగా ప్రతిఘటించారో?