YS Jagan Responds on Vijayawada Krishna River Boat Accidentవిజయవాడ వద్ద కృష్ణా నదిలో బోటు ప్రమాదం గురించి తాను రెండు రోజులు ఆగి మాట్లాడుతున్నానని విపక్ష నేత జగన్ చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే మాట్లాడితే రాజకీయం చేస్తున్నారని అంటారని, రెండు రోజుల తర్వాతే మాట్లాడుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగామమాడుతున్నారని, ఘటనకు బాధ్యత వహించి ఒక్క మంత్రి కూడా రాజీనామా చేయలేదని ఆయన అక్షపించారు.

సాక్షాత్తు సీఎం ఇంటికి కూతవేటు దూరంలోనే బోటు మునిగిపోవడం దారుణం అని అన్నారు. అయితే రెండు రోజులు ఆగి చేసిన వెంటనే చేసిన అది రాజకీయమే కదా? గతంలో జగన్ తండ్రి రాజశేఖర రెడ్డి హయాంలో కూడా పడవ మునిగి ఏకంగా 61 మంది చనిపోయారు. అప్పుడు ఏ మంత్రి రాజీనామా చేసారు అని టీడీపీ నాయకులు అడుగుతున్నారు.

మరోవైపు ఇలాంటి ప్రమాదం మళ్లీ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పర్యాటకులు, ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచడంతోపాటు, వారి రక్షణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా ఒక రోడ్‌మ్యాప్‌ ను సిద్ధం చేసే బాధ్యతను కొందరు ఉన్నతాధికారులకు అప్పగించింది. అదే సమయంలో ఘటనకు బాధ్యులైన ఏడుగురిని సస్పెండ్ చేసింది.