YS Jagan Bail Cancellationఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారిన జగన్ బెయిల్ రద్దు కేసుపై తుది తీర్పును సిబిఐ కోర్టు రిజర్వ్ చేసింది. వచ్చే నెల 15న ఇందుకు సంబంధించిన తీర్పు వెలువరించనుంది.

జగన్ కేసులలో ఏ2 విజయసాయి రెడ్డి బెయిల్ పై కూడా కోర్టు ఆ రోజు ప్రాథమికంగా తన అభిప్రాయాన్ని తెలుపుతుంది. వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలుచేసిన ఈ పిటిషన్‌పై జూలై ఆఖరులో వాదనలు ముగిశాయి.

తీర్పును అప్పటినుంచి కోర్టు రిజర్వు చేసింది. ముఖ్యమంత్రిగా తనకుండే అధికారాలను ఉపయోగించి.. జగన్‌ బెయిల్‌ షరతులు ఉల్లంఘిస్తున్నారని.. కోర్టులకు సహకరించడం లేదని… సాక్షులను ప్రభావితం చేస్తున్నారని రఘురామ పిటిషన్‌లో ఆరోపించారు.

ఇకపోతే… ఈ నెలలోనే లండన్, ప్యారిస్ టూర్ కు వెళ్లాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. తన 25వ పెళ్లి రోజు సందర్భంగా జగన్, ఆయన సతీమణి భారతి తో హాలిడే కి వెళ్లాలని భావిస్తున్నారు. అయితే బెయిల్ మీద ఉన్న జగన్ కోర్టు పర్మిషన్ లేకుండా విదేశాలకు వెళ్ళలేరు.

ఆయన పాస్ పోర్టు కూడా కోర్టు ఆధీనంలోనే ఉంది. అయితే బెయిల్ రద్దు చెయ్యాలి అనే కేసు పెండింగ్ లో ఉన్న తరుణంలో విదేశాలకు వెళ్ళడానికి కోర్టు అనుమతిస్తుందా అనేది చూడాలి. అయితే ఈ విషయంగా తమ లాయర్లతో జగన్ సంప్రదిస్తున్నారట… ఒకవేళ అనుమతి వచ్చే అవకాశం లేదంటే అసలు ట్రిప్ నే రద్దు చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు.