Why-is-Jagan--Fearing-Electionsనరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం ఆ పార్టీకి తలపోటుగా పరిణమించింది. ఆయనకు షో కాజ్ నోటీసు ఇస్తే… అసలు మీరు వైఎస్సార్ కాంగ్రెస్ అనే పేరు వాడటం చెల్లదు… వాడితే ఎన్నికల కమిషన్ మీ పార్టీని రద్దు చెయ్యవచ్చు అనే కొత్త వాదన ఆయన తెరమీదకు తెచ్చారు.

ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తనదని… ఆ పేరు ఎవరు వాడకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ భాషా. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరు వైఎస్సార్ కాంగ్రెస్ అని వాడుకుంటున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ .. వైఎస్సార్ అనే పదాన్ని వాడకుండా చూడాలని ఎన్నికల సంఘాన్ని కోరామని చెప్పారు. వైఎస్సార్ అనే పదంతో రిజిస్టర్ అయిన ఏకైక పార్టీ అన్న వైఎస్సార్ పార్టీ ఒక్కటేనని వెల్లడించారు. జగన్ పార్టీ వారి అధికార పత్రాలపై పూర్తి పేరు వాడకుండా వైఎస్సార్ అని రాయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

అదే సమయంలో… తమ పార్టీ పేరు వాడుతున్నందుకు అభ్యంతరం తెలుపుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని వ్యాఖ్యానించారు అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాషా. దీనిపై ఎన్నికల కమిషన్ ఏపీలోని అధికార పార్టీకి ఏ విధమైన ఉత్తరువులు ఇస్తుందో చూడాలి. ఒకరకంగా ఇది అనవసరమైన తలపోటు అనే చెప్పుకోవాలి.