YS Jagan questions chandrababu naidu on EVM scamఈవీఎంల గురించి మాట్లాడుతూ మొన్న ఆ మధ్య చంద్రబాబు ఒక మాట ‘నాకు అసలు నా ఓటు తెలుగుదేశం పార్టీకే పడిందా అని అనుమానం’ అన్నారు. సహజంగా ఏదైనా ఒక పరిస్థితి సీరియస్ నెస్ ను తెలపడానికి ఇటువంటి అతిశయోక్తి వ్యాఖ్యలు చెయ్యడం మన అందరికీ తెలిసిందే. అయితే ఇది నిజంగానే చంద్రబాబు అన్నారని ఆపాదించేసి ఆయన బురద జల్లుతున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ వారు. సాక్షాత్తు జగన్ రాజ్ భవన్ ముంగిట ఈ మాట అనడం గమనార్హం.

“80 శాతం జనాభా వెళ్లి పోలింగ్‌ బూత్‌కి వెళ్లి ఓటు వేశారు. వాళ్లు ఎవరికి ఓటు వేశారో వీవీ ప్యాడ్‌లో చూసుకొని సంతృప్తిగా బయటకు వచ్చారు. ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు. నేను ఫ్యాన్ కి వేసినా.. సైకిల్ కి పడితే ఊరుకోరు కదా? అలా అయితే ప్రజలు ఎందుకు ఊరుకుంటారు?,” అని జగన్ మీడియా ముఖంగా ప్రశ్నించారు. అయితే జగన్ పోలింగ్ రోజు ప్రజలు ఇబ్బంది పడిన విషయాన్నీ మాత్రం ఎందుకనో చాలా తేలికగా తీసుకున్నారు. ఎన్నికల సంఘం భేష్ అంటూ తీర్మానించేశారు.

ఈవీఎంల పని తీరు విషయంలో జగన్ కు అనుమానాలు లేకపోవచ్చు. కాకపోతే వాటి వల్ల ప్రజలు ఇబ్బంది పడిన మాట వాస్తవం అవునా కదా? ఇబ్బంది పడిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ ఓటర్లు కూడా ఉంటారు. ఆ కారణంగా ఓటు వినియోగించుకొని వారు కూడా ఉంటారు. ఆ విషయాన్నీ కూడా తప్పు అనలేకపోవడానికి కారణం ఏంటో? అధికారుల బదిలీ విషయంలో ఎన్నికల సంఘం చేసిన సాయానికి జగన్ ఈ రకంగా బదులు తీర్చుకుంటున్నారా? సరే అనకపోతే అనకపోయారు ఏకంగా ఎన్నికల సంఘం బాగా పని చేసిందని లేఖలు రాయాల్సిన అవసరం ఉందా?