Ys Jagan Public Meeting at Avanigaddaసిఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు కృష్ణాజిల్లా అవనిగడ్డలో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ, “మన ప్రభుత్వం మూడు రాజధానులతో రాష్ట్రంలో ప్రజలందరికీ మేలు చేయాలని ప్రయత్నిస్తుంటే ఓర్వలేని దత్తపుత్రుడు చెప్పు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడారు. వీధి రౌడీలు ఏవిదంగా మాట్లాడుతారో నాకు తెలీదు కానీ వారి కంటే హీనంగా ఆయన మాట్లాడారు. ఒక రాజకీయ పార్టీకి నేతనని చెప్పుకొనే ఆయన ఇంత నీచంగా మాట్లాడటం చూస్తుంటే ఇటువంటివారు మనకి అవసరమా? అని అనిపిస్తుంది. ఆయన చేత ఆవిదంగా మాట్లాడించింది ఎవరో అందరికీ తెలుసు. ఇద్దరూ కలిసి నన్ను దెబ్బ తీయడానికి కుట్రలు పన్నుతున్నారు. అయితే ఆ దేవుడు, ప్రజలు నావైపు ఉన్నంతవరకు నన్ను ఎవరూ ఏమీ చేయలేరు,” అని అన్నారు.

‘ఒరేయ్ వెదవల్లారా…’ అనే మాట సిఎం జగన్‌కు బూతు మాటగా అనిపిస్తే, గత మూడున్నరేళ్ళుగా నిత్యం తన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు మాట్లాడుతున్న నిఖార్సైన బూతులను ఏమనుకోవాలో? వాటిని విని ఎందుకు ఆనందిస్తున్నారో?ముఖ్యంగా ఆయన మంత్రివర్గంలో ‘బూతుల మంత్రి’ గా పేరొందిన అంబటి రాంబాబు, మాజీ మంత్రి కొడాలి నానిల బూతు పురాణం గురించి అందరికీ తెలిసిందే. మరి జగనన్నకు తెలియదనుకోలేము కదా?

విశాఖలో పవన్‌ కళ్యాణ్‌ని హోటల్‌ గదిలో నిర్బందించి ఆయన సహనం కోల్పోయేలా చేసినప్పటికీ ఆయన చాలా సంయమనంగా కేవలం “ఒరేయ్ వెదవల్లారా….” అని మాత్రమే అంటూ చెప్పు చూపి హెచ్చరించారు. కానీ పాదయాత్ర చేస్తున్న రైతులపై రాజమండ్రిలో కార్యకర్తల చేత చెప్పులు, కుర్చీలు విసిరించింది వైసీపీ ఎమ్మెల్యే మార్గని భరత్‌ కాదా? పవన్‌ కళ్యాణ్‌ కేవలం చెప్పు చూపితేనే వీధి రౌడీగా కనిపిస్తే, రైతులపై దాడి చేయించడాన్ని ఏమనుకోవాలి?అయినా ఓ ప్రతిపక్ష నేతగా పవన్‌ కళ్యాణ్‌ విశాఖ పర్యటనకు వస్తే పోలీసుల చేత ఆయనను ఎంతగా వేధించాలో అంతగాను వేధించి ఇప్పుడు నీతులు వల్లించడం చాలా హాస్యాస్పదంగా ఉంది.

అనాడు వంశీ మాధవరెడ్డి అన్నప్పుడు

కొడాలి నీయమ్మ మొగుడు అన్నప్పుడు

తమ్మినేనిని రాజకీయ లంజత్వం అన్నప్పుడు

ధర్మాన రైతులను బూతులు తిట్టినప్పుడు

దువ్వాడ దూల మాటలు మాట్లాడినప్పుడు

అంబటి,అవంతి అరగంట, గంట అని ఆటలాడినప్పుడు

గోరంట్ల డర్టీ పిక్చర్ చూపినప్పుడో

ఈ నాయకులు మనకి అవసరమా? అని సిఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచించుంటే ఇప్పుడు ఈవిదంగా ఎవరి చేత చెప్పు చూపించుకొని “ఒరేయ్ వెదవల్లారా…” అని అనిపించుకొనే పరిస్థితి వచ్చేదే కాదు కదా? కానీ తన కళ్లెదుటే చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై కూడా వైసీపీ నేతలు అనుచితంగా మాట్లాడుతుంటే చిర్నవ్వులు చిందించిన సిఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం?

అయినా ‘మొగుడు కొట్టినందుకు కాదు ఏడుస్తున్నది… తోటి కోడలు నవ్వినందుకు’ అన్నట్లు… ఇప్పుడు కూడా పవన్‌ కళ్యాణ్‌ తమని ‘ఒరేయ్ వెదవల్లారా…’ అని చెప్పు చూపి తిట్టినందుకు బాధపడుతున్నట్లు లేదు. పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబు నాయుడు దగ్గరయ్యారని, కలిసి పనిచేస్తామని చెప్పినందుకు బాధ పడుతున్నట్లుంది.

పవన్‌ కళ్యాణ్‌ని దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్ అంటూ వేధిస్తూ ఇంతకాలం ఏది జరగకూడదని వైసీపీ అధినేత కోరుకొన్నారో చివరికి అదే జరిగేసరికి తట్టుకోలేక ఆందోళనతో ఈవిదంగా మాట్లాడుతున్నట్లు ఆయన మొహం చూస్తేనే అర్దమవుతోంది. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్లు ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏమిటి?