YS jagan pledge on womens day in andhra pradesh assemblyఆంధ్రప్రదేశ్ తొలిరోజు బడ్జెట్ సమావేశాలు మహిళా దినోత్సవం నాడు ప్రారంభం కావడంతో మహిళలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా పలువురు ప్రసంగించారు. అలాగే ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న మరికొన్ని అంశాలను ప్రస్తావిస్తూ ప్రతిపక్షం అధికార పార్టీపై మండిపడింది. అంతటి ప్రాముఖ్యత గల విషయంపై సభా స్పీకర్ కోడెల శివప్రసాద్ ఒక ప్రతిజ్ఞ చేయించారు.

“మహిళల అభ్యున్నతికి, అభ్యుదయానికి కృషి చేస్తామనేది” ఈ ప్రతిజ్ఞ సారాంశం. అయితే ఈ ప్రతిజ్ఞ చేస్తున్న సమయంలో జగన్ వైఖరి మరోసారి చర్చనీయాంశమైంది. ప్రతిజ్ఞ అంటే సాధారణంగా చేయి చాపి ఎదుటి వారు చెప్పింది చెప్తూ ఉండాలి. కానీ, జగన్ వర్యులేమో… చేయి చాచకుండా, ఓ పేపర్ ను చేతిలో పట్టుకుని, దాని వైపు చూస్తూ స్పీకర్ చెప్తున్నది పలకనా… వద్దా… అన్నట్లుగా పలుకుతూ వచ్చారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా అందరూ చేతులు చాచి ప్రతిజ్ఞ చేయగా, జగన్ మాత్రం తన దారి అధికార దారి కాదని మరోసారి ఈ సందర్భంగా చాటిచెప్పారు. మరో విశేషమేమిటంటే… జగన్ మాదిరి కాకుండా ఇతర వైసీపీ నేతలు ప్రతిజ్ఞను ప్రతిజ్ఞగానే చేసారు. బహుశా అందరి కంటే విరుద్ధంగా చేయడమే తన గొప్పతనం అనుకుంటున్నారేమోనని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.