YS Jagan - Narendra Modiఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ కు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేసి కరోనా పరిస్థితి గురించి మాట్లాడారట. మోడీ తాను చెప్పాల్సింది చెప్పి పెట్టేశారని తాము చెప్పేది కూడా వింటే బావుంటుందని సొరేన్ ట్విట్టర్ లో ఒక ట్వీట్ పెట్టి సంచలనం సృష్టించారు. ఇప్పటికే కరోనా ని కట్టడి చెయ్యడంలో విఫలమైన నరేంద్ర మోడీ సర్కారు తీవ్ర విమర్శలు పాలవుతుంది.

ఈ తరుణంలో సొరేన్ చేసిన కామెంట్లు ఇంకా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమయంలో అసలు సంబంధమే లేకపోయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలగజేసుకుని సొరేన్ కు సుద్దులు చెప్పారు. దేశం ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందని.. ఇటువంటి సమయంలో మనం ఒకరికొకరు నిందించుకోకుండా కలిసి పని చేసి మోడీని బలపరచాని చెప్పుకొచ్చారు.

“రాష్ట్రాలు పెను విపత్హు ఎదురుకుంటున్న తరుణంలో మోడీ ముఖ్యమంత్రుల సలహాలు కూడా తీసుకోవాలి. సొరేన్ రాజకీయాలు చేశారో లేక నిజంగానే తన బాధను వెళ్ళగక్కారో? అసలు సంబంధం లేని విషయంలో జగన్ ఎందుకు తలదూర్చినట్టు?,” అంటూ సోషల్ మీడియాలో అనేక ప్రశ్నలు వెల్లువలా వస్తున్నాయి.

టీడీపీ సమర్ధకులైతే జగన్ బెయిల్ రద్దు పిటిషన్ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి జగన్ మోడీ ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారని విమర్శిస్తున్నారు. ఇకపోతే జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టులో నేడు విచారణ జరిగింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ మరికొంత సమయం కోరారు. దీంతో సీబీఐ కోర్టు కేసు విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది.