YS Jagan planning for 25 districts in andhra pradeshఎన్నికల సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక హామీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ. ప్రతీ పార్లమెంట్ సీటు పరిధిని ఒక్కో జిల్లాగా చేస్తామని జగన్ అప్పటికే ప్రకటించారు. ఎన్నికల్లో విజయం సాధించడంతో ఎన్నికల హామీలు నిలుపుకోవడం పై దృష్టి పెట్టిన జగన్ కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా చర్యలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పలు వివరాలు పంపాలని అన్ని జిల్లాల యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అన్ని కలెక్టరేట్‌ అధికారులు సమగ్ర నివేదిక రూపొందించి పంపారు.

లోక్‌సభ పరిధిలోని రెవెన్యూ డివిజన్లు, అసెంబ్లీ నియోజక వర్గాలు,వాటి రిజర్వేషన్లు, మండలాలు, గ్రామాలు, విస్తీర్ణం, జనాభా, ఒకే మండలంలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండటం వంటి వివరాలు పంపాలని చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీసీఎల్‌ఏ) ఆదేశించారు. ప్రభుత్వం కోరిన వివరాలన్నీ రావడంతో ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించాలి. వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ అవసరాలను బట్టి కూడ కొన్ని సర్దుబాట్లు ఉంటాయని సమాచారం.

గత టర్మ్ లో తెలంగాణాలో కేసీఆర్ కూడా జిల్లాల సంఖ్యా పెంచారు. చిన్న జిల్లాల వల్ల అధికార యంత్రాంగంపై పనిభారం తగ్గి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు సాధించడం తేలిక అవుతుందని, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకు మరింత సమర్థవంతంగా తీసుకువేళ్ళ వచ్చు అనే లక్ష్యాలతో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగినా, జిల్లాల ఏర్పాటు వల్ల రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కూడా బాగా పుంజుకుని ప్రభుత్వానికి రాబడి పెంచుతుంది అనేది కూడా ఇంకో ఆలోచన.