YSR-Congress---YS-Jagan--Padayatraప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర సోమవారం ఉదయం అనంతపురం జిల్లాలో ప్రారంభమైంది. బసినేపల్లి తండా నుంచి గుత్తి వరకు పాదయాత్ర సాగనుంది. ఈరోజు సాయంత్రం గుత్తిలో జగన్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. జిల్లాలో 8 నియోజకవర్గాల్లో 250 కిలోమీటర్ల మేర 20 రోజులకుపైగా జగన్ పాదయాత్ర చేయనున్నారు.

అనంతపురం జిల్లాలో 2014 ఎన్నికలలో టీడీపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. తన పాదయాత్రతో జిల్లాపై పట్టు సాధించాలని జగన్ ప్రయత్నం. ఇప్పటివరకు 25 రోజులపాటు సాగిన జగన్ పాదయాత్ర 356.8 కిలోమీటర్ల దూరం సాగింది. ఇప్పటివరకు కడప జిల్లా మరియు కర్నూల్ జిల్లాలలో ఆయన పాదయాత్ర సాగింది.

మధ్యమధ్యలో శుక్రవారం కోర్టు పనులమీద హైదరాబాద్ వెళ్లడం తప్ప జగన్ ఏకధాటిగా నడిచారు. ఈ పాదయాత్ర ఆయనను ముఖ్యమంత్రి సింహాసనంలో కూర్చోబెడుతుందని ఆయన నమ్మకం. 120 నియోజకవర్గాల పాదయాత్ర తరువాత జగన్ 50 నియోజకవర్గాలలో బస్సు యాత్ర చెయ్యనున్నారు. తద్వారా అన్ని నియోజకవర్గాలు కవర్ చెయ్యాలని ఆయన ప్లాన్.