Ys-Jagan-Padayatra-2000kmవిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. సరిగ్గా అదే సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశించింది. అదే జిల్లాలోని మాదేపల్లి గ్రామంలో ఆయన పాదయాత్ర 2000 కిలోమీటర్ల మార్కు చేరుకుంటుంది. 2019కి పశ్చిమ గోదావరి జిల్లా అన్ని రకాలుగా వైకాపాకు కీలకమైంది.

పోయిన ఎన్నికలలో ఇదే జిల్లాలో వైకాపా ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటుగానీ, ఎంపీ సీటుగానీ గెలవలేకపోయింది. 2014 ఓటమిలో పశ్చిమ గోదావరి జిల్లా పాత్ర ఎంతో కీలకం. అదే సమయంలో ఇప్పటికీ జిల్లాలో పెద్దగా మార్పు ఏమీ కనబడటం లేదు. జిల్లా నాయకులలో, శ్రేణులలో 2014లో ఆవహించిన నీరసం ఇప్పటికి అలానే ఉంది.

తమ ప్రమేయం ఏమీ లేకుండా జగన్ చరిష్మా, ప్రభుత్వం వ్యతిరేకతను బట్టే గెలవాలి అనే ఉద్దేశంతో ఉంది అక్కడి నాయకత్వం. దీనితో ప్రజలతో పాటు పార్టీలోని ఎన్నో సమస్యలు కూడా జగన్ కు పశ్చిమ గోదావరిలోకి స్వాగతం చెబుతున్నాయి. వాటిని చేధించడంలోనే వైకాపా గెలుపు ఆధారపడివుంది.