Jagan Voters Deletionఫారం 7 అప్లికేషన్లు ఇచ్చి ఓట్లు తీయించాలని ప్రయత్నించిన వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఆ తరువాత ఆ పని తామే చేశామని జగన్ స్వయంగా చెప్పుకోవడంతో ఇరుకున పడింది. మీ ఓటు పోయిందంటే అది వైకాపా పనే అని టీడీపీ గ్రామాలలోకి బలంగా తీసుకుని వెళ్ళగల్గింది. దీనితో ఆ పార్టీ నేతలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఇప్పటికి కూడా జగన్ కు ఆ విషయం అర్ధం కాకపోవడం విశేషం. కాకినాడలో జరిగిన వైఎస్సాఆర్ కాంగ్రెస్ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత నష్టం చేకూర్చేలా ఉన్నాయి.

“ఓట్లు తీసెయ్యమని ..ఫారం 7 లు .. మనమే ఇచ్చాం… అందుకని మన వాళ్ల మీద కేసులు పెట్టారు. దీని గురించి ప్రతి గ్రామంలో చర్చ జరిగేట్టు చూడండి,” జగన్ కార్యకర్తలకు చెప్పుకొచ్చారు. ఇప్పటికే జగన్ అలా చెప్పినందుకే కింద స్థాయి పార్టీ నేతలు బయట తిరగలేని పరిస్థితి. ఇప్పుడు ఏకంగా ఆ విషయాన్నీ ప్రతి గ్రామంలో చర్చ జరిగేట్టు చూడాలంట. ఈ విషయంలో జగన్ వైఖరి చూస్తుంటే ఆయన రియాలిటీకి చాలా దూరంగా ఉంటున్నారని చెప్పుకోవాలి.

ఎన్నికలకు ఇంకా నెల రోజులు మాత్రమే ఉన్నాయి. వచ్చే నెల సరిగ్గా ఇదే రోజున ఓటింగు జరుగుతుంది. ఇప్పుడు చేసే ప్రతీ తప్పుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి పరిస్థితి. దీనితో ఆచితూచి వ్యవహరిస్తే అది ఆయనకే మంచిది. కొత్తగా ఏర్పడిన ప్రాంతీయ పార్టీ ఐన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో ఓడిపోతే వరుసగా రెండు టర్మ్ల పాటు ప్రతిపక్షంలో మనుగడ సాగించడం చాలా కష్టం. ఈ క్రమంలోనైన జీవన్మరణ సమస్య వంటి ఈ ఎన్నికలలో జగన్ జాగ్రత్త పడాలి.