Alla Ramakrishna -Reddyమంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు ఒకింత ఆశ్చర్యకరంగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో ముచ్చటగా మూడు శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన నారా లోకేష్‌ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారంటూ ఆయన ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు వారికి పరామర్శించాలన్న బాధ్యత ఆయనకు లేదా అంటూ ప్రశ్నలు సంధించారు. వరద వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు హైదరాబాద్‌ పారిపోతారా అంటూ ఆర్కే మండిపడ్డారు.

అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్న చంద్రబాబు వరదలను రాజకీయం చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం లోకేష్ కొన్ని రోజుల క్రితమే వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. చంద్రబాబు చేతి నొప్పి కొరకు పూర్తి స్థాయిలో రెస్టు తీసుకోమని వైద్యులు సూచించిన విషయం అందరికీ తెలిసిందే. నిన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో కూడా ఆయన చేతికి కట్టుతో కనిపించారు. సరే ఆర్కే వాదనలతో ఏకీభవిద్దాం…

మరి వరదల సమయంలో వేరే దేశానికి వ్యక్తిగత టూర్ కు వెళ్ళిన జగన్ ని ఏమని అనాలి? ప్రతిపక్ష పార్టీ కంటే ముఖ్యమంత్రికి ఎక్కువ బాధ్యత ఉండాలి కదా అని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. వరదల సందర్భంగా ముఖ్యమంత్రి కేవలం కొన్ని ప్రాంతాలను ఏరియల్ సర్వే చేసి ఊరుకున్నారు కదా? రాజకీయ విమర్శలు మంచివే కానీ వెనుకా ముందూ చూసుకోకుండా చేస్తే అవి మనకే తగిలే ప్రమాదం ఉంది కదా? కొంచెం చూసుకోండి ఆర్కే గారు.