M9News-Wishes-YS-Jagan-The-New-Leader-of-Andhra-Pradesh-All-The-Bestఎన్నికల సందర్భంగా సామాజిక పెన్షన్లు రెండు వేలకు పెంచుతామని తొలుత జగన్ మాట ఇచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చివర్లో పెన్షన్లు పెంచి 2000 రూపాయిలు చెయ్యడంతో తాము అధికారంలోకి వస్తే పెన్షన్లు 3000 రూపాయిలు చేస్తామని ప్రకటించాల్సి వచ్చింది జగన్. అయితే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా అది ఇప్పుడు క్లిష్టంగా మారింది. దీనితో పెన్షన్ల పెంపు దశల వారీగా చెయ్యాలి జగన్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతానికి వీటిని 250 రూపాయిలు మాత్రమే పెంచాలని ఆయన నిర్ణయించారు. ప్రస్తుతం 250 రూపాయిలు పెంచుతూ సంబంధిత శాఖ అధికారులు దస్త్రం సిద్ధం చేశారు. దీనిపై గురువారం ప్రమాణస్వీకారం సందర్భంగా జగన్‌ సంతకం చేస్తారా లేదా అనేది చూడాలి. చంద్రబాబు పాలన వల్ల ఖజానాకు చిల్లు పడిందని అందుకే పెన్షన్ల పెంపులో కొంత జాప్యం జరుగుతుందని, అర్ధం చేసుకోవాలని జగన్ ప్రజలను కోరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

విభజిత ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రమాణ స్వీకారం కోసం సిద్ధంచేసిన వేదిక వద్దకు 12.15 గంటల కల్లా జగన్‌ చేరుకొంటారు. ఆయన వెంట తెలంగాణ సీఎం కేసీఆర్‌, డీఎంకే అధ్యక్షులు స్టాలిన్‌, ఒరిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌ వేదిక మీదకు చేరతారు. సీఎంగా జగన్‌ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం.. జగన్‌ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం పూర్తి కాగానే కేసీఆర్‌, నరసింహన్‌, జగన్‌ కలిసి ఢిల్లీ చేరుకొని.. ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం.