YS Jagan on Ease of doing business2014 నుండి దేశంలోకి పెట్టుబడులు పెద్ద సంఖ్యలో ఆకర్షించడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రాల మధ్య పోటీ తత్వాన్ని పెంపొందించడానికి ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులు ప్రవేశపెట్టింది. ఈ ర్యాంకులు భారత ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు కలిపి ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ 2015లో రెండవ స్థానం, 2016, 2017లో నెంబర్ వన్ స్థానాన్ని సాధించింది.

దీనితో చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. అయితే ఒక అధికారిక సమావేశంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి… పెట్టుబడిదారుల సమక్షంలో ఈ ర్యాంకులను తీసి పారేశారు. “ఆంధ్రప్రదేశ్ ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో టాప్ 1, 2, 3 ఉందంటూ గొప్పగా చెప్పుకునే వారు. అదేంటో నాకు అర్ధం కాలేదు,” అన్నారు.

“2014 నుండి 2019 వరకు ఎటువంటి ఇన్సెంటివ్స్ ఇవ్వలేదు. అవి ఇవ్వకుండా మన రాష్ట్రంలో ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ వన్ స్థానంలో ఉందని ఎలా చెప్పగలం?,” అంటూ చెప్పారు. పెట్టుబడిదారుల సమక్షంలో కేవలం చంద్రబాబు నాయుడు మీద రాజకీయ పాయింట్లు స్కోర్ చెయ్యడానికి ఇటువంటి వ్యాఖ్యలు చెయ్యడం దారుణం.

చంద్రబాబుని దెబ్బ కొడుతున్న అనుకుంటూ…. సొంత రాష్ట్రాన్ని దెబ్బ కొడుతున్నారు జగన్. కనీసం కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు ఇచ్చిన ర్యాంకులను కూడా ఓర్వలేని పరిస్థితిలో జగన్ ఉండటం దారుణం. ఇటువంటి వ్యాఖ్యల వల్ల రాష్ట్రం ఇమేజ్ దెబ్బ తినకపోతే చాలు అనుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు.