YS Jagan on corruptions of previous government (1)ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం ఇంజనీరింగ్ నిపుణుల కమిటీతో సమావేశమయ్యారు. అంచనాలు పెంచిన ఇరిగేషన్ ప్రాజెక్టుల లెక్కలు తీయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని సహించేదిలేదని, ప్రాజెక్టుల్లో అవినీతి జరగడానికి వీల్లేదు అని తేల్చి చెప్పారు. టెండర్ల విధానాన్ని అత్యంత పాదర్శకంగా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఆయన ఒక సంచలనమైన విషయం బయటపెట్టారు.

చెడిపోయిన వ్యవస్థను బాగుచేసుకోవడానికి తపిస్తున్నా.. కళ్లు మూసుకోండని నాపైనా ఒత్తిడి తెచ్చారని.. అలా చేయదలుచులేదు కాబట్టే అవినీతిపై పోరాటానికి సిద్ధం అయ్యాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఇలాంటి స్కామ్‌లను సమర్థించలేమన్న జగన్.. పై స్థాయినుంచి కింది స్థాయి వరకూ ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని సహించరనే ఒక మెసేజ్‌ వెళ్లాలన్నారు. ఒక ముఖ్యమంత్రిని కళ్లు మూసుకోండని చెప్పడం మాములు విషయం కాదు. అయితే నిత్యం భద్రతా వలయంలో ఉండే ముఖ్యమంత్రి అటువంటి వారిని వెంటనే పోలీసులకు అప్పగించాల్సింది.

ఆ భద్రతా వలయాన్ని ఛేదించుకుని ముఖ్యమంత్రితో వారు కాంటాక్ట్ అవ్వగలిగారో. మరోవైపు , రూ.100ల పని రూ.80లకే జరుగుతుందంటే రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్దామని నిపుణుల కమిటీకి తెలిపారు సీఎం వైఎస్ జగన్… ప్రాజెక్టుల్లో అవినీతిని గుర్తించిన అధికారులను సన్మానిస్తామన్న ఆయన.. రివర్స్‌ టెండరింగ్‌ ఎక్కడ చేయగలమో గుర్తించండి అని ఆదేశించారు.పోలవరం పనుల్లో అక్రమాలపై నిగ్గు తేల్చాలని నిపుణుల కమిటీని ఆదేశించారు. పోలవరం టెండర్లు కూడా సమీక్షించాలని ఆయన చెప్పుకొచ్చారు.