Ys jagan offers MP seat for lagadapati raja gopalవిజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గురువారం ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన లోటస్ పాండ్ భవనంలో కలిశారు. తన కుమారుడి పెళ్ళికి జగన్ ను పిలవడానికి లగడపాటి వెళ్లారు. పెళ్లి శుభలేఖను అందించి సపరివార సమేతంగా రావాలని జగన్ ని ఆహ్వానించారు.

ఈ సందర్భంగా లగడపాటిని జగన్ ప్రైవేట్ గా మాట్లాడాలని కోరారు. దీనితో వారిద్దరూ 20 నిమిషాల పాటు ఏకాంత చర్చ జరిపారు. 2019లో జగన్ పార్టీ చాల వెనుకబడి ఉందని, చూస్తా ఉంటే 2014లో సాధించినన్ని సీట్లు కూడా ఈసారి కష్టం అవ్వొచ్చని జగన్ కు లగడపాటి చెప్పినట్టు సమాచారం.

అదే సమయంలో లగడపాటి ని పార్టీలో జాయిన్ కావాల్సినదిగా జగన్ ఆయనను కోరారు. ఆయనకు ఏ ఎంపీ సీట్ కావాలంటే అది ఇఛ్చి పార్టీలో కూడా సముచిత గౌరవం కలిపిస్తాం అని హామీ ఇచ్చారు. అయితే తనకు రాజకీయాల్లో తిరిగి వచ్ఛే అవకాశం లేదని లగడపాటి తేల్చి చెప్పారు. మరోపక్క లగడపాటి చెప్పిన సర్వే లెక్కలతో జగన్ లో నిర్లిప్తత ఆవహించిందట.

ఈ నెల 6నుండి ఇడుపులపాయలో మొదలయ్యే జగన్ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు సాగుతుందని, 13 జిల్లాల్లో దాదాపు 3 వేల కిలోమీటర్ల మేరకు ఈ యాత్ర కొనసాగనుంది. జగన్‌ ప్రతీరోజూ 15 నుంచి 16 కిలోమీటర్లు నడిచి, రాత్రిపూట అక్కడే బస చేస్తారని పార్టీ తెలిపింది. పాదయాత్ర సందర్భంగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు ఆయనతో కలసి నడుస్తారు.