YS Jagan NTR familyగతంలో చంద్రబాబు నాయుడుకు చెక్ చెప్పడానికి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరిని వాడారు. పురంధేశ్వరిని ఏకంగా కేంద్ర మంత్రిని చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు జగన్ కూడా నందమూరి కుటుంబాన్ని చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రోత్సహించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇందుకు గానూ జగన్ ముందు ఉన్న ఆప్షన్స్ మూడు – లక్ష్మీపార్వతి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మరియు ఆయన కుమారుడు హితేష్ చంచురామ్.

2014 ఎన్నికల తరువాత లక్ష్మీపార్వతి అల్లుడి మీద పగతో వైఎస్సార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం, తరచూ ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబుని తిట్టడం చేసే వారు. ప్రకాశం జిల్లా పర్చూరు స్థానం నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైకాపా నుంచి బరిలోకి దిగారు. వాస్తవానికి ఈ సీటును ఆయన కుమారుడు హితేష్‌కు ఆశించినా.. పౌరసత్వం విషయంలో తలెత్తిన సమస్యతో సాధ్యపడలేదు. కొడుకు సీటు కోసం జగన్ వద్దకు వెళ్ళిన వెంకటేశ్వరరావునే చివరికి బరిలోకి దిగారు.

అయితే ఆయన టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు చేతిలో ఓటమి పాలయ్యారు. దగ్గుబాటి గెలిస్తే ఆయనను స్పీకర్ ను చేసి చంద్రబాబు చేత అధ్యక్షా అనిపించాలన్న జగన్ కోరిక తీరలేదు. చంద్రబాబుకు చెక్ చెప్పడానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గానీ హితేష్ కు గానీ ఎమ్మెల్సీ పదవి ఇవ్వొచ్చు మంత్రిని కూడా చెయ్యొచ్చు. వీరిద్దరికి అయితే రెండున్నర ఏళ్ళ తరువాత జరిగిన కేబినెట్ విస్తరణలో నిర్ణయం తీసుకోవచ్చు జగన్. అదే లక్ష్మీపార్వతి అయితే కేవలం ఎమ్మెల్సీతో సరిపెట్టే అవకాశం ఉంది.