YS-Jagan-not going back on polavaram project reverse tenderingపోలవరం ప్రోజెక్టు గమనంలో కీలక తరుణం ఆసన్నమైంది. ఆంధ్రప్రదేశ్ లో అధికారమార్పిడి కారణంగా ప్రొజెక్టు పనులు ఉన్నఫళంగా ఆగిపోయారు. అవినీతి పేరుతో ఇప్పటి దాకా ఉన్న గుత్తేదారు ను జగన్ ప్రభుత్వం బయటకు పంపింది. ప్రాజెక్టు వ్యయం తాగిస్తాం అంటూ రివర్స్ టెండరింగ్ కు వెళ్ళింది ప్రభుత్వం. దీనికి కేంద్రం కూడా ఒప్పుకోలేదు. ధరలు పెరుగుతాయి, ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతుంది అని హెచ్చరించింది. దీనివల్ల లాభనష్టాలు మీవే అని వారించినా జగన్ ప్రభుత్వం మునుపటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే ముందుకు వెళ్ళింది.

ఈ క్రమంలో ఈ నెల 17న పోలవరం ప్రాజెక్టుకు రివర్స్‌ టెండరింగ్‌‌కు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. హెడ్‌ వర్క్స్‌లో మిగిలిన పనులు, హైడల్‌ ప్రాజెక్టుకు కలిపి…రూ.5,070 కోట్లకు టెండర్లు పిలవబోతోంది. రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తే పనుల్లో జాప్యంతోపాటు నిర్మాణ వ్యయం పెరుగుతుందని పోలవరం అథారిటీ వ్యాఖ్యానించింది. రివర్స్ టెండరింగ్‌పై మరోసారి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని కోరింది. అయినా రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఎల్లుండి (శనివారం) టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ కానుంది. ఒకవేళ రివర్స్‌ టెండరింగ్‌ లో ధరలు పెరిగితే అది ప్రభుత్వానికి రాజకీయంగా కూడా ఇబ్బంది కలగవచ్చు. కేంద్ర ప్రభుత్వనికి కూడా ఈ ప్రాజెక్టుకు సహకరించకపోవడానికి మంచి వంక వెతికి పెట్టింది జగన్ ప్రభుత్వం. ఇక్కడ ఇంకో కొసమెరుపు ఏమిటంటే ఇప్పుడు ప్రోజెక్టు నుండి తప్పించిన నవయుగను కూడా ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ లో పాల్గొనడానికి అనుమతి ఇచ్చింది. ఆ కారణంగానే ప్రోజెక్టు నుండి తప్పించినా నవయుగ కోర్టుకు వెళ్ళలేదు. ఒక వేళ అందరికంటే తక్కువ బిడ్ మళ్ళీ నవయుగనే వేస్తే పరిస్థితి ఏంటి అనేది చూడాలి.