YS Jagan - no reponse to pending filesముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల రోజులు పూర్తి చేసుకున్నారు. తన మిత్రుడు కేసీఆర్ లా కాకుండా తన కేబినెట్ ని కూడా తొందరగానే ఏర్పాటు చేసేసుకున్నారు. మంత్రులు ఛార్జ్ కూడా తీసుకున్నారు. అయితే పాలన మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందట. ప్రతి డిపార్టుమెంటులో గుట్టల కొద్దీ ఫైళ్ళు పేరుకుపోయాయి అని కారణం. దీనికి కారణం ముఖ్యమంత్రే అని తెలుస్తుంది. జగన్ మొన్న ఆ మధ్య మంత్రులకు ఒక ఆదేశం ఇచ్చారు.

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మంత్రుల వద్ద పనిచేసిన సిబ్బంది ఎవరినీ తిరిగి అదే పోస్టుల్లో లేదా వేరే కీలక బాధ్యతల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోవద్దని ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అప్పటి మంత్రుల కార్యాలయాల్లో ఆఫీసర్స్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ, ప్రైవేట్‌ కార్యదర్శులు, అదనపు ప్రైవేట్‌ కార్యదర్శులు, వ్యక్తిగత సహాయకులుగా పలువురు పనిచేశారు. ఇక వారందరికీ మళ్ళీ క్యాబినెట్ మంత్రుల వద్ద పని చేసే అవకాశం ఇవ్వరాదని తేల్చి చెప్పేశారు.

కొత్త నియామకాలు జగన్ ఓకే అన్నాకే జరుగుతున్నాయి. అయితే ఈ విషయంలో పని ముందుకు సాగడం లేదంట. మెజారిటీ మంత్రులు కొత్త వారు కావడం పాత వారికి కూడా శాఖలు కొత్త కావడంతో అధికారులు లేక పని ముందుకు సాగడం లేదట. పైగా ఒక సామాజిక వర్గం వారి కోసమే చూస్తుండడంతో ఆ మేరకు కొరత కూడా ఉందట. అసలే రెండున్నర ఏళ్లకు 90% మంత్రులను మారుస్తామని చెప్పేశారు జగన్ అందులో ఒక నెల ఇలాగే పోయిందని మంత్రులు బాధ పడుతున్నారు.