YS JAGAN -No Maskసోషల్ మీడియాలో ఈ ఉదయం నుండి ఒక వీడియో హల్ చల్ చేస్తుంది. అనంతపురంలో కొందరు యువకులు మాస్కులు లేకుండా బయటతిరుగుతున్నారట. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని నిబంధన ఉండటంతో పోలీసు వారు వారిని బలవంతంగా క్వారంటైన్ కు తరలిస్తున్నారు. కొందరు యువకులను చేతులు, కాళ్ళు పట్టుకుని మరీ అంబులెన్సులలోకి ఎక్కిస్తున్నారు.

కొందరు పోలీసులు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు అంటుంటే… కొందరు పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అంటున్నారు. అయితే ఆ విషయం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

పోలింగ్ నిర్వహించే అధికారులు మాస్కులు పెట్టుకుంటే ముఖ్యమంత్రి మాత్రం ఎటువంటి మాస్కు ధరించకుండా ఉన్నారు. పైగా నవ్వుతూ వారితో మాట్లాడుతున్నారు కూడా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిబంధనలను పాటించకుండా… రాష్ట్ర ప్రజలకు ఏం మెస్సేజ్ ఇస్తున్నారు అనేది ఆలోచించుకోవాలి.

ఇదే తప్పు సామాన్యుల చేస్తే వారికి విధించే దండన వేరేగా ఉంటుంది. మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెంసింగ్ పాటించడం వంటి వాటితో ముఖ్యమంత్రి సమాజానికి సరైన మెస్సేజ్ ఇచ్చినవారు అవుతారు. సోషల్ మీడియా లో కొందరు 151 ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చిన ధీరుడు కాబట్టి కరోనా ఏమైనా ముఖ్యమంత్రి చుట్టుపక్కలకు రానని హామీ ఇచ్చిందా అంటూ ఎద్దేవా చేస్తున్నారు.