All YSRCP members except Jagan faces suspensionఏపీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ఇచ్చి వార్తల్లోకెక్కిన వైసీపీ అధినేత జగన్… అసలు ఆ అవిశ్వాసం ఎందుకు పెట్టారో “గుట్టు” విప్పారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు డిస్ క్వాలిఫై అవుతారనే ఉద్దేశంతోనే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టామని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసారు. టీడీపీలో చేరిన ఆ 8 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి లేదా వారిని డిస్ క్వాలిఫై చేయాలని, చంద్రబాబుకు దమ్ముంటే ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో మళ్లీ పోటీ చేయించాలని సవాల్ విసిరారు.

జగన్ స్కెచ్ ఇలా ఉంటే అసలు ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కనిపించకపోవడం విశేషం. వైకాపా పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభమైన వేళ వీరంతా సభకు హాజరు కాలేదు. వీరికి విప్ జారీ చేశామని ఇప్పటికే స్పష్టం చేసిన వైకాపా, వీరు అసెంబ్లీకి వచ్చి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయకుంటే, చట్టపరమైన చర్యలకు వెళ్లాలని జగన్ భావిస్తున్నట్లు స్పష్టమైంది.

మరోవైపు వైకాపా అవిశ్వాసంపై వేగంగా పావులు కదిపిన తెలుగుదేశం పార్టీ తక్షణ చర్చకు అనుమతించగా, ఫిరాయింపు దారులు సభలో లేకుండానే చర్చ జరుగుతోంది. ఇక వారికి వైకాపా జారీ చేసిన విప్ అందిందా? లేదా? అన్న దానిపై జగన్ చర్యలు తీసుకునే అవకాశం ఉందా? లేదా? అన్న విషయం తెలియనుంది. అతి వేగంగా మారిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో జగన్ “స్కెచ్”కు టిడిపి కౌంటర్ “స్కెచ్” అదిరింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.