YS Jagan - Nilam Sawhney - high court-supreme courtప్రభుత్వ కార్యాలయాలకు వైఎస్సార్ కాంగ్రెస్ రంగులు వెయ్యడంలో ప్రభుత్వం చూపిస్తున్న మొండి వైఖరి అధికారులకు ఇబ్బందిగా పరిణమిస్తుంది. రాజకీయాలకు సంబంధం లేని రంగులు వెయ్యాలని కోర్టు ఆదేశాలు పాటించకుండా ఉన్న మూడు రంగులకు ఇంకో రంగు యాడ్ చేసి జీవో ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ జీవో ని మళ్ళీ కొట్టేసి ప్రభుత్వం మీద కోర్టు ధిక్కార కేసు పెట్టింది హై కోర్టు.

ఆ కేసు విషయంగా ఈరోజు చీఫ్ సెక్రటరీ నీలం సహానీ, పంచాయితీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ, పంచాయితీ కమీషనర్ గిరిజా సంజర్ ఈరోజు కోర్టు ముందు హాజరు అయ్యారు. అయితే హై కోర్టు కొట్టేసిన జీవో పై సుప్రీమ్ కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనితో ఈరోజు కేసును వాయిదా వేసింది.

సహజంగా సీనియర్ అధికారులు కోర్టు ముందు హాజరు కావడం నామోషీ గా ఫీల్ అవుతారు. అది కూడా కోర్టు ధిక్కారణ కేసు అంటే మరీ ఇబ్బంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వ మొండి వైఖరితో వారికి ఏమీ చెయ్యలేని పరిస్థితి. మరోవైపు గతంలోనే గ్రామ సచివాలయాలకు రాజకీయ పార్టీలకు చెందిన రంగులను పులమొద్దని గతంలో ఒకసారి సుప్రీమ్ కోర్టు చెప్పిన మళ్ళీ కోర్టు తలుపుతట్టడం విశేషం.

తమ పార్టీ రంగులైన నీలం, తెలుపు, ఆకుపచ్చకు తోడుగా ఎర్రమట్టి రంగును చేర్చి రంగులు వెయ్యాలని ప్రభుత్వ కోరికగా ఉంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వానికి చుక్కెదురు కావడం ఖాయమని న్యాయ నిపుణులు అంటున్నారు.