ys jagan navaratnaluఅయిదేళ్ల అధికారంలో తానేమీ చేస్తానో అన్న విషయాన్ని క్లుప్తంగా ‘నవరత్నాలు’ పేరుతో పార్టీ మేనిఫెస్టోను రూపొందించి ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. అలాగే పాదయాత్ర చేస్తున్న సందర్భంలో మరికొన్ని వరాలను ప్రకటించారు. మరి పాలనలో సగం కాలం పూర్తయ్యింది. ఇంతవరకు జగన్ ఏం చేసారు? చెప్పిన మేనిఫెస్టోను సరిగ్గా అమలు చేసారా?

వైసీపీ నేతలు అయితే 95 శాతానికి పైగా ఇప్పటికే అమలు చేసారని చెప్పుకుంటున్నారు. అయితే దీనిపై ప్రముఖ మీడియా ఛానల్ టీవీ5 “నవమోసాలు” పేరుతో ఓ సంచలన కధనాన్ని ప్రసారం చేసింది. నాడు జగన్ ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తూ, వైసీపీ నేతలు చెప్పిన 95%లోని నిజాలను ప్రజలకు వివరించే విధంగా ఈ కధనం ఉంది. జగన్ ను ప్రజలు నిలదీస్తున్నారంటూ నాడు ఇచ్చిన హామీలను వరుసగా గుర్తు చేసారు.

45 ఏళ్లకే మహిళలకు ఇస్తామన్న పెన్షన్ ఎక్కడ?

కేంద్రంతో సంబంధం లేకుండా ‘రైతు భరోసా’ పేరుతో ఇస్తానన్న 12500 ఎక్కడ?

రెండేళ్లలో పూర్తి చేస్తానన్న కడప ఉక్కు పరిశ్రమ ఎక్కడ?

రేషన్ సన్నబియ్యం హామీ ఎక్కడ?

వారంలోనే ఇంటికి నడుచుకుంటూ వస్తుందన్న రేషన్ కార్డు ఎక్కడ?

వారంలో రద్దు చేస్తానన్న సీపీఎస్ ఎక్కడ?

కుటుంబంలో ఎంతమంది ఉన్నా, ‘అమ్మ ఒడి’ ఇస్తానన్న హామీ ఎక్కడ?

25 లక్షల ఇల్లు కట్టిస్తామన్న హామీ ఎక్కడ?

కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఎక్కడ?

అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తానన్న 3 వేల పెన్షన్ ఎక్కడ? కనీసం ఏటా పెంచుతూ పోతానన్న 250 రూపాయల పెన్షన్ ఎక్కడ?

పరుగులు పెట్టిస్తానన్న పోలవరం, అమరావతి ఎక్కడ?

తిత్లీ తుఫాన్ బాధితులకు ఇస్తానన్న నష్టపరిహారం ఎక్కడ?

బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తానన్న 50 రోజుల పర్యటన ఎక్కడ?

ఏటా జనవరిలో విడుదల చేస్తానన్న జాబ్ క్యాలెండరు ఎక్కడ?

మొదటి ఏడాదే తీసుకువస్తానన్న మెగా డీఎస్సీ ఎక్కడ?

రైతులకు వేయిస్తానన్న ఉచిత బోర్లు ఎక్కడ?

అన్న క్యాంటీన్ ల అవినీతిని బయటపెట్టి 3 నెలల్లో ప్రారంభిస్తానన్న రాజన్న క్యాంటీన్లు ఎక్కడ?

అగ్రి గోల్డ్ బాధితులకు మొదటి ఏడాదే ఇస్తానన్న 1150 కోట్లు ఎక్కడ?

కేసీఆర్ తో కలిసి కేంద్రం మెడలు వంచి సాధిస్తామన్న “ప్రత్యేక హోదా” ఎక్కడ?

రైతుల కోసం 3 వేల కోట్లతో చేస్తామన్న “ధరల స్థిరీకరణ నిధి” ఎక్కడ?

లీటర్ పాలకు అదనంగా ఇస్తామన్న 4 రూపాయలు ఎక్కడ?

కరోనా బాధితులకు ఇస్తామన్న 2 వేల సహాయం ఎక్కడ?

కరోనాతో మరణించిన వారికి ఇస్తానన్న 15 వేలు ఎక్కడ?

చంద్రబాబు కొట్టేసాడన్న “పింక్ డైమండ్” ఎక్కడ?

నారా లోకేష్ బినామీ అని చెప్పిన శేఖర్ రెడ్డి ఎక్కడ?

చంద్రబాబు చేసిన 6 లక్షల కోట్ల అవినీతి బయట పెడతానన్నది ఎక్కడ?

అమరావతి, పోలవరంలో జరిగిన అవినీతి ఎక్కడ?

పట్టిసీమ ప్రాజెక్ట్ లో జరిగిందన్న 100 కోట్ల అవినీతి ఎక్కడ?

నారా లోకేష్ ఫైబర్ గ్రిడ్ లో చేశాడన్న అవినీతి ఎక్కడ?

5 వేలు చేతిలో పెట్టి ఇదేనా ఉద్యోగ కల్పన?

మేనిఫెస్టోలో పెట్టిన ‘నవరత్నాలు’ మాత్రమే కాదు, ఎన్నికల సమయంలో అనేక హామీలను ఇచ్చిన జగన్, అవన్నీ పూర్తి చేసిన తర్వాతే మళ్ళీ ప్రజల వద్దకు వచ్చి ఓట్లు అడుగుతానని భారీ స్థాయిలో నాడు ప్రసంగించారు. మరి ఈ హామీల జాబితా చదివితే ఆయాసం రావడమే గానీ, ఆలోచన లేని హామీలుగా మిగిలిపోతున్నాయి. నాడు ఏదో తెలియక హామీలిచ్చేసాం అని ఒక చిన్న మాటతో సరిపెట్టడం వైసీపీ సర్కార్ వంతవుతోంది. నాడు ఇచ్చిన హామీలలో మరికొన్ని…

రైతులకు ఉచిత బోర్లు, కౌలు రైతులకు వడ్డీ లేని రుణాలు

ఆక్వా రైతులకు యూనిట్ కు రూపాయికే విద్యుత్

రైతులకు సున్నా వడ్డీకే రుణాలు, రైతు కుటుంబాలకు 7 లక్షల భీమా

పంట ధర ముందే నిర్ణయం, ఆ రేటు ఎవరూ కొనకపోతే ప్రభుత్వమే కొనడం

కేంద్రంతో కలిసి 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తు పరిహార నిధి

రైతులకు ఉచితంగా వాడుకునేందుకు మండలానికో కోల్డ్ స్టోరేజ్, గోదాము

మగ్గం ఉన్న ప్రతి ఇంటికి ఏటా 24 వేలు

చిరు వ్యాపారస్తులకు గుర్తింపు కార్డుతో పాటు సున్నా వడ్డీకే 10 వేలు రుణం

కిడ్నీ సహా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10 నెలకు వేల పెన్షన్

హైదరాబాద్, బెంగుళూర్, చెన్నైలలో ఎక్కడైనా ఆరోగ్య శ్రీ వర్తింపు

దశల వారీగా మద్యపాన నిషేధం

ఖాళీగా ఉన్న 1 లక్షా 30 వేల ఉద్యోగాల భర్తీ

ఎస్సీ, ఎస్టీ అమ్మాయిల పెళ్లికానుక కింద 1 లక్ష

బీసీ అమ్మాయిల పెళ్లి కానుక కింద 50 వేలు

ముస్లిం, మైనార్టీ ఆడబిడ్డల పెళ్లిళ్లకు 1 లక్ష

బీసీల అభ్యున్నతికి 15 వేల కోట్ల చొప్పున ఐదేళ్లల్లో 75 వేల కోట్లు

కాపు కార్పొరేషన్ కు 2 వేల కోట్లు

అర్చకులకు ఇళ్ల స్థలాల కేటాయింపుతో పాటు ఇళ్ల నిర్మాణం

మత్య్సకారుల పడవలకు ఆర్ధిక సహాయంతో పాటు, ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబానికి 10 లక్షల ఎక్స్ గ్రేషియా

జూనియర్ లాయర్లకు ప్రతినెలా 5 వేల స్టైఫండ్

ఇమామ్ లకు 10 వేలు, మౌజన్ లకు 5 వేలు

మసీదు, గుడి, చర్చి సహాయం క్రింద ఒక్కోదానికి 15 వేలు

ప్రతి జర్నలిస్ట్ కు ఇళ్ల స్థలం

ఇవన్నీ కాకుండా పారిశ్రామిక కారిడార్లు, విమానాశ్రయాలు, ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు… ఇలా అన్ని వర్గాలలోనూ హామీలను గుప్పించి, నేడు వాటిని అమలు చేయలేక ఆర్ధిక ఇబ్బందులతో తలమునకలవుతోంది. ఇచ్చిన హామీలలో కొన్నింటిని అమలులోకి తెచ్చినప్పటికీ, మొదటి ఏడాదికి మూడవ ఏడాదికి కేటాయింపులలో వ్యత్యాసం స్పష్టంగా కనపడుతోంది.

అంటే లబ్దిదారుల సంఖ్యను తగ్గించే పనిలో ప్రభుత్వం ఉందని స్పష్టమవుతోంది. ఇలా అవగాహనా రాహిత్యంతో చేసిన హామీలను ప్రశ్నిస్తూ ప్రసారమైన ఈ “నవమోసాలు” కధనం సంచలనంగా మారింది. ఫైనల్ గా తేలేది ఏమిటంటే… హామీలన్నీ అమలు చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానన్న జగన్, భవిష్యత్తులో ఏమి చెప్పి ప్రజలను ఓట్లు అడుగుతారోనని!?