YS- Jagan - Narendra Modiపోలవరం నిధుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం రాజుకున్న విషయం విదితమే. పోలవరం అంచనా విలువ రూ.20398.61 కోట్లే అని, తమకు ప్రాజెక్టు లో అతిపెద్ద ఖర్చయిన భూసేకరణ, పునరావాసంతో సంబంధం లేదని కేంద్రం మాట మార్చింది. ఇప్పటివరకు దాని మీద రాష్ట్రప్రభుత్వం సీరియస్ గా మాట్లాడింది లేదు.

ఇది అలా ఉండగా… ఆ వివాదం సంగతి ఎలా ఉన్నా ఇప్పటికే శాంక్షనైన 2,234.288 కోట్ల నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాగోలా కేంద్రాన్ని ఒప్పించగలిగింది అయితే దానికి ఒప్పుకున్నట్టే ఒప్పుకుని రాష్ట్ర ప్రభుత్వనికి మోడీ ప్రభుత్వం ఒక కొర్రీ వేసింది. ఇక నుండి పోలవరం నిధులు ఇవ్వడానికి ప్రత్యేకంగా ఒక పీడీ అకౌంట్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పింది.

ఈ అకౌంట్ లో కేంద్రం వేసే నిధులు కేవలం ప్రాజెక్ట్ పనులకు మాత్రమే ఉపయోగించేందుకు వీలవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వేరే అవసరాలకు వాడుకోవడానికి కుదరదు. ఈ మధ్య జగన్ ప్రభుత్వం వివిధ నిధులను సంక్షేమ పథకాలకు అంటూ మళ్ళిస్తుంది. దానితో కేంద్రం ఈ రకంగా కండిషన్ పెట్టింది. ఇది ఒకరకంగా జగన్ ప్రభుత్వానికి ఇబ్బందే.

ఇది ఇలా ఉండగా… ఈరోజు సోమశిల ప్రాజెక్ట్‌ రెండో దశ పనులకు సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “వ్యవసాయం, నీటి విలువ తెలిసిన ప్రభుత్వం మాది. నీటి ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. 2022 ఖరీఫ్ సీజన్‌కు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం,” అంటూ చెప్పుకొచ్చారు.