ys jagan narendra modiఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకస్మికంగా ఢిల్లీకి వెళుతున్నారు. మంగళవారం రాత్రి 9 గంటలకు ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సమావేశమవుతారు. భారీ వర్షాలు, నివర్‌ తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలు, ధ్వంసమైన రహదారులు, ఆస్తినష్టం గురించి వివరించి… తక్షణమే సహాయం అందించాలని జగన్‌ కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

అయితే ఇందులో నిజం లేదని… బీజేపీ పెద్దలు జగన్ తో మాట్లాడే పని ఉండి ఆయనను ఢిల్లీ రప్పించుకుంటున్నారని సమాచారం. సాగు చట్టాలపైౖ రైతులు ఉద్యమిస్తున్న తరుణంలో …. జాతీయ స్థాయిలో ఆ చట్టాల పై విస్తృతంగా ప్రచారం చేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. రైతుల ఉద్యమం నేపథ్యంలో ఆ చట్టాలకు కొన్ని మార్పులు తీసుకురాబోతున్నారు.

అందుకు రాజ్యసభ లో వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు అవసరం. అయితే నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ జరిగిన ‘భారత్‌ బంద్‌’కు వైసీపీ సర్కారు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు కోసం జగన్ తో మాట్లాడాలని నిర్ణయించుకున్నారట.

ఇందుకే ఆయన్ను ఢిల్లీ పిలిపించుకున్నారు. సహజంగా జగన్ తో పని ఉంటే … కేంద్రం నుండే ఎవరో ఒకరు ఆంధ్రప్రదేశ్ రావాలి…. ఇప్పుడంతా రివర్స్. అయితే ఈ వంకనైనా ఆంధ్రప్రదేశ్ కు నాలుగు డబ్బులు రాలితే మంచిదే. ఈ పర్యటనలో ప్రధానిని కలవాలని జగన్ ప్రయత్నించినా… కలిసే అవకాశం లేదని సమాచారం.