YS Jagan - Nandamuri Balakrishna (1)రాజకీయాలలో అనాలోచిత నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా నందమూరి నటసింహం బాలకృష్ణ అంటే ఎంత అభిమానమో తెలుసా? వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అయితే జగన్ మోహన్ రెడ్డి నిర్మాతగా బాలకృష్ణ హీరోగా ఓ భారీ బడ్జెట్ చిత్రం నిర్మించనున్నారనే ప్రచారం జరిగింది. అంతలా బాలయ్య అంటే జగన్ కు ఇష్టమని పొలిటికల్ వర్గాలు పేర్కొంటాయి.

అయితే రాజకీయంగా ప్రత్యర్ధి పార్టీ ఎమ్మెల్యే కావడంతో బాలకృష్ణపై బహిరంగంగా అంత ప్రేమ కురిపించలేని పరిస్థితి నెలకొందని, జగన్ అనుయాయులు చెప్తుంటారు. అందుకే ప్రత్యర్ధి పార్టీలో ఉన్నా, ఇప్పటివరకు బాలకృష్ణపై ఒక్క విమర్శ కూడా చేయలేదని చెప్తుంటారు. అయితే విమర్శల మాట పక్కన పెడితే, తాజాగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణపై వైసీపీ అధినేత జగన్ ప్రశంసల జల్లు కురిపించినట్లుగా తెలుస్తోంది.

“బాలకృష్ణ చాలా మంచోడు, ఎవరినీ తిట్టరు, ఎవరినీ విమర్శించరని” జగన్ కితాబిచ్చినట్లుగా టిడిపి ఎమ్మెల్యే కదిరి బాబూరావు ఈ రోజు అసెంబ్లీలో సరదాగా వ్యాఖ్యానించారు. ఈ మాటలు విన్న టిడిపి ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్… ‘జగన్ కామెంట్స్ నిజమేనా?’ అంటూ ఆశ్చర్యచకితులయ్యారు. దీనికి బాబురావు నిజమేనని, అతంలో బాలకృష్ణ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడిగా కూడా జగన్ పనిచేశారని చెప్పడంతో అక్కడున్న వారంతా ఫక్కున నవ్వేసారు.