YS Jagan Mohan Reddy AP Chief Minister‘చెప్పాడంటే – చేస్తాడంతే’ అనేది జగన్ ను ఎలివేట్ చేస్తూ వైసీపీ ఇచ్చే స్లోగన్. అయితే అందుకు తగ్గ పాలనను జగన్ అందివ్వడం లేదు, జగన్ చేస్తోన్న పాలనను ‘చెప్పాడంటే – చేయడంతే’ అనేది సరిగ్గా సరిపోతుందని టీడీపీ సోషల్ మీడియా వింగ్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. దీనికి తోడుగా ‘చేసేది చెప్పడు – చెప్పింది చేయడు’ అనేది కూడా వైరల్ అవుతోంది. అందుకు తగిన సంఘటనలను కూడా పేర్కొంటున్నారు.

రాజధాని అమరావతిలోనే అంటూ నాటి ఎన్నికలలో రాష్ట్రమంతా చెప్పుకుంటూ తిరిగాడు., అది టీడీపీ చేస్తున్న విషప్రచారం అందులో నిజం లేదని చెప్పారు. ఎన్నికల తరువాత అసలు నిజం అందరికి తెలిసొచ్చింది. అదే మాదిరి వైసీపీ ప్రభుత్వంలో మహిళా భద్రతకు భరోసా జగనన్న అంటూ ఒక ‘దిశా – దశా’ లేని “దిశా” చట్టాన్ని తీసుకువచ్చారంటూ టీడీపీ మహిళా నేతలు మండిపడుతున్నారు.

సామాన్య ప్రజానీకం సంగతి పక్కనుంచితే అసలు వైసీపీ నాయకులు., మంత్రులే మహిళలపై వేదింపులకు., మానసిక దాడులకు తెగపడుతున్న వైనాలు ఎన్నో ప్రచార మాధ్యమాల ద్వారా చూస్తూనే వస్తునాం అంటూ మచిలీపట్నంలో నాగలక్ష్మి, కర్నూల్ లోని పద్మజ ఉదంతాన్ని, లేటెస్ట్ గా కడపలో జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తున్నారు.

నరసారావుపేటలో అనూష, అనంతపురంలో స్నేహలత, పులివెందులలో నాగమ్మ, విశాఖలో లక్ష్మి, విజయవాడలో తేజస్విని ఇలా ఏంతో మంది ఆడపిల్లల తల్లితండ్రులు న్యాయం కోసం దిక్కులు తిరేగే పరిస్థితి. ‘మద్యనిషేధం’ అన్నారు చివరికి ప్రభుత్వమే మద్యం షాపులను నడుపుతోంది.

ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండరు అన్నారు, ఆ క్యాలెండర్లో సంవత్సరాలు మారుతున్నాయి కానీ నిరుద్యోగుల తల రాత మారడం లేదని., బాబాయ్ హత్య నిందితులను వెంటనే అరెస్ట్ చెయ్యాలన్నారు.., అధికారంలోకి వచ్చి 1000 రోజులు గడిచిన చేసిందేమి లేదని ఎద్దేవా చేసారు తెలుగుదేశం కార్యకర్తలు.

పేదలకు వినోదం అందుబాటులో అంటూ ఒక విచిత్ర ధోరణితో ముందుకొచ్చి అటు సినీ ఇండస్ట్రీకి ఇటు సినీ ప్రేక్షకుడి అర్ధం కానటువంటి జీవోను తీసుకొచ్చింది. జగన్ ఉద్దేశంలో పేదల పట్ల అంత ఆధరణే ఉంటే ఎన్నికల ముందు “యాత్ర” అంటూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకున్న సినిమాను 5 రూపాయల టికెట్ ధరతో ప్రజలకు చూపించి ఉండొచ్చు కదా? అంటూ నిలదీశారు టీడీపీ నాయకులు. ఈ టికెట్ ధరల తగ్గింపు ఎన్నికల హామీలో చెప్పలేదు కానీ చేశారు.

ప్రభుత్వమే చికెన్,మటన్, ఫిష్ మార్టులనుపెట్టి అమ్మకాలు జరుపుతాం అని చెప్పలేదు కానీ చేశారు., చెత్త పన్ను, మరుగుదొడ్డి పన్ను వేస్తామని చెప్పలేదు, కానీ చేసింది., ఇంటి పన్ను- కరెంటు చార్జీలు పెంచుతాం అని చెప్పలేదు కానీ చేసింది., మూడో, నాలుగో రాజధానులని చెప్పలేదు కానీ చేయడానికి ప్రయత్నిస్తుంది.

తిరుమలను ఆధ్యాత్మిక నగరంగా కాకుండా ఒక వ్యాపార సంస్థగా మారుస్తామని చెప్పలేదు కానీ చేస్తున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై జగన్ పాలనపై ఆధారాలతో సహా ప్రజల ముందుంచి ఏకిపారేసింది టీడీపీ సోషల్ మీడియా విభాగం. దేవాలయ భూములను., ప్రభుత్వం ఆస్తులను., అమరావతి రాజధాని భూములను అమ్ముతానని కానీ తాకట్టు పెడతానని కాని చెప్పలేదు కానీ చేసాడంతే .

అన్నొస్తున్నాడు…, రావాలి జగన్ – కావాలి జగన్., నేను ఉన్నాను – నేను విన్నాను., అంటూ ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన స్లోగన్స్ ను కూడా వదిలి పెట్టలేదు టీడీపీ సోషల్ మీడియా.

అన్నొచ్చాడు …, అభివృద్ధి పోయింది., అరాచకాలు వచ్చాయి. “నేను ఉన్నాను – మీరు విన్నారు.,” “మీరు విన్నారు – నేను చెప్పాను.,” “నేను చెప్పాను – మీరు నమ్మారు.,” “మీరు నమ్మారు – నేను అమ్మాను” అని జగన్ ప్రభుత్వ వైఖరిని ఛలోక్తులు రూపంలో ప్రజల ముందుంచే ప్రయత్నం చేసారు. ఏపీ ప్రజలను జగన్ తన మాయ మాటలతో మోసం చేసారని., జగన్ అంటే అంతే ‘చెప్పింది చేయడు… చేసేది చెప్పడు” అంటూ తమ ట్రోల్స్ ను కంటిన్యూ చేస్తున్నారు టీడీపీ వర్గీయులు.