Jagan Mohan Reddy In Andhra Pradesh Assemblyఏదైనా ఒక ఊరికి తాగు నీరు లేక సాగు నీరు కల్పించాలంటే ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తుంది? కొత్తగా ఒక పారుదల ప్రాజెక్ట్ ను నిర్మించడం గానీ లేక ఎత్తిపోతల పధకం ద్వారా ప్రజలకు నీటిని అందుబాటులోకి తేవడం వలన గానీ చాలా రొటీన్ గా జరిగే విషయం.

అయితే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాదిరి ‘అవుట్ అఫ్ ది బాక్స్’ ఆలోచించే వారు అతి కొద్దీ మంది మాత్రమే ఉంటారని, అందుకు నేడు అసెంబ్లీ వేదిక అయ్యిందని, అది చూసి తరించే భాగ్యం నెటిజన్ల వంతు… అన్న స్థాయిలో ఓ వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

“పలనాడుకు సాగు నీరు – తాగు నీరు సదుపాయాలు లేవన్న సీఎం జగన్, ఇటువంటి తాగు నీరు – సాగు నీరు కల్పించడం కోసం ఒక మెడికల్ హాస్పిటల్ ను కట్టించాల్సిన పరిస్థితి కూడా అక్కడ ఉంది అధ్యక్షా” అంటూ జగన్ స్టేట్మెంట్ ఇచ్చారు.

ఏంటి పొరపాటుగా ఏమైనా టైప్ చేసారని భావిస్తారేమో, అది ఎంత మాత్రమూ కాదు, అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రి గారే సదరు విషయాలను వెల్లడించారు. సాగునీటికి – తాగునీటికి – మెడికల్ హాస్పిటల్ కు ఉన్న అనుబంధం బహుశా జగన్ గారికే తెలియాలి మరి!