YS-Jagan-Mohan-Reddy-revenge-on-Visakhapatnam-policeరెండున్నరేళ్ల కింద వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డిని విశాఖ ఎయిర్‌పోర్టులో కొందరు పోలీసులు అడ్డుకోవడం ఆ సమయంలో వారిని రెండే రెండు సంవత్సరాలు మీ అందరి అంతూ చూస్తా అని వార్నింగ్ ఇచ్చిన సంగతి అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. వారిని ప్రభుత్వం పోలీసులను వీఆర్‌ (వేకెన్సీ రిజర్వ్‌)కు సరండర్‌ చేస్తున్నట్లు తెలిసింది. దీనిప్రకారం నగర పోలీస్‌ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ముగ్గురు ఎస్సైలు, ఒక ఏఎస్సైని వీఆర్‌కు పంపుతూ జూలై 27న పోలీసు కమిషనర్‌ ఆదేశాలు జారీచేసినట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.

దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు మాత్రం బయటకు రాలేదు. అలాగే ఆ ఘటన జరిగినప్పుడు నగరంలో పనిచేసిన, తాజాగా విశాఖ రేంజ్‌ పరిధిలో పనిచేస్తున్న మరికొంతమంది అధికారులను కూడా వీఆర్‌కు పంపినట్లు సమాచారం. దీనితో వారిపై జగన్ కోపం చల్లారినట్టు అయ్యింది అని వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అయితే ఎవరు అధికారంలో ఉన్న ప్రభుత్వ ఆదేశాలను అమలు చెయ్యడం తమ విధి అని దానిని విరోధంగా చూడటం దారుణమని పోలీసులు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో 2017 జనవరి 26న విశాఖ బీచ్‌రోడ్డులో వైఎస్సార్ కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొంటానని అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ ప్రకటించారు. గణతంత్ర వేడుకల రోజున బీచ్‌రోడ్డులో నిరసన కార్యక్రమం నిర్వహిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించిన నగర పోలీసులు విశాఖ రావద్దని ఆయన్ను కోరారు. అదే సమయంలో విశాఖలో పెట్టుబడుల సదస్సు కూడా జరుగుతుండడంతో జగన్ ను విమానాశ్రయంలోనే ఆపేశారు.