YS Jagan Mohan Reddy ration delivery schemeరేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యే ‘ఇంటింటికీ రేషన్ పథకం’ రాష్ట్రంలో ఉన్న పంచాయతీ ఎన్నికల కోడ్ కారణంగా ఆగే పరిస్థితి ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టుని ఆశ్రయించింది. రాజకీయ పార్టీలు, నేతల జోక్యం లేకుండా పథకం నిర్వహించాలని ఆదేశిస్తూ… దీనికి సంబంధించిన ప్రణాళిక తయారు చేసుకుని రెండు రోజుల్లో ఎస్ఈసీని కలవాలని హైకోర్టు స్పష్టం చేసింది.

అయితే ఈ సందర్భంగా ఒక మెలిక కూడా పెట్టింది. పంపిణీ సందర్భంగా ఎక్కడా రాజకీయ పార్టీల రంగులు ఉండకూడదని స్పష్టం చేసింది. ప్రజా సంక్షేమ పథకాలు సొంత డబ్బులతో ఎవరూ చేయరని…ట్యాక్స్ పేయర్స్ డబ్బుతో పథకాలు నిర్వహిస్తారనేది గుర్తుంచుకోవాలని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

అయితే వైఎస్సార్ కాంగ్రెస్ హయంలో అసలు కుదరని పని అది.. రేషన్ ఇచ్చే సరుకుల సంచుల నుండి రవాణా చేసే వాహనాల వరకు మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ రంగులతో నింపేశారు. ఇప్పుడు వాటితో పంపిణీ చేస్తామంటే నిమ్మగడ్డ ఒప్పుకోడు… కోర్టుకు వెళ్తే వాహనాలకు రంగులు మార్చాలని కోర్టు తీర్పిస్తే మొదటికే మోసం రావొచ్చు అని ప్రభుత్వం ఆందోళన చెందుతుంది.

ఎన్నికల అయ్యే వరకు డోర్ డెలివరీ ఆపేయడమా లేక పని మొదలుపెట్టేసి నిమ్మగడ్డ ఆపితే… చంద్రబాబు ప్రోద్బలంతో పేద ప్రజల కడుపు కొడుతున్నారు అని చెప్పుకుందామా అనే ఆలోచన చేస్తుంది అధికార పార్టీ.ఈ వ్యవహారం వచ్చే వారంలో తేలిపోతుంది.