Jagan's promise to unemployed youth2014లో టీడీపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు కల్పించలేని యువతకు “నిరుద్యోగ భృతి” అనే పధకం కింద కొంత మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేసేది. అయితే అప్పటి ప్రతిపక్ష పాత్ర పోషించిన వైసీపీ నిరుద్యోగులకు కావాల్సింది ‘నిరుద్యోగ భృతి కాదు, ఉద్యోగాలు అని, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి రాష్ట్రమంతా పాదయాత్ర చేశారు.

మరి తీరా అధికారంలో వచ్చాక జగన్ సర్కార్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుందా? అంటే ‘జరిగింది శూన్యమని’ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుపడుతున్నాయి. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ని, జాబ్ మేళా అని ప్రకటనలకు మాత్రమే ప్రభుత్వం పరిమితమైందని.., కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఇలా ఎన్నో ఆశలు యువతకు చూపి వైసీపీ అధికారంలోకి వచ్చిందని టీడీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.

“నేను ఉన్నాను – నేను విన్నాను” అని ఊరూరా చెప్పుకొని తిరిగి ఇప్పుడు “నేను ఆదేశిస్తాను – మీరు ఆచరించాలి” అన్న చందంగా జగన్ ఆలోచన సరళి మారిపోయిందని ప్రతిపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. జగన్ ప్రభుత్వానికి ఓటు వేసిన యువత ఆశించింది ఐటీ ఉద్యోగాలు., గ్రూప్ 1,2., టీచర్, పోలీస్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉండే ఖాళీలను., ఇతర ప్రభుత్వశాఖలలో ఉద్యోగాలను భర్తీ చేయమని..!

కానీ జగన్ ప్రభుత్వం యువతకు ఇచ్చింది మాత్రం వాలంటీర్లు, బియ్యం వ్యాన్లు, లిక్కర్ షాపులలో అమ్మకాలు, చేపల అమ్మకాలు, చికెన్-మటన్ కొట్టడానికి ఉద్యోగాలను భర్తీ చేశారని తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ చెప్తున్నారు. “అన్నొస్తున్నాడు,” “రావాలి జగన్ – కావాలి జగన్” అనే నినాదాలతో ముందుకెళ్లిన వైసీపీకి, ఇపుడు “రావాలి జాబులు – కావాలి జీతాలు” అనే నినాదం బాగా వినిపిస్తోంది. నేడు కేసీఆర్ చేసిన ప్రకటన కూడా జగన్ కు ఈ సెగ తగిలేలా చేస్తోంది.